AP Elections 2024: మంత్రి ధర్మానకు టెన్షన్.. సీన్ రివర్స్ అయినట్టేనా..!?
ABN, Publish Date - May 20 , 2024 | 01:32 PM
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections) కీలకఘట్టమైన పోలింగ్ ముగిసింది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ అభ్యర్థుల్లో టెన్షన్ సాధారణమే. కానీ గత ఎన్ని కల్లో బొటాబొటీ మెజార్టీతో గెలిచిన వైసీపీ (YSR Congress) అభ్యర్థుల్లో మాత్రం మరింత టెన్షన్ కనిపిస్తోంది. ఇందులో ప్రస్తుత శ్రీకాకుళం వైసీపీ అభ్యర్థి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) ముందువరుసలో ఉన్నారు..
గత ఎన్నికల్లో మెజార్టీ 5,777 మాత్రమే..
మంత్రి పదవి చేపట్టినా.. నియోజకవర్గ అభివృద్ధి శూన్యం
శ్రీకాకుళం అర్బన్, గ్రామీణమంతా వైసీపీకి వ్యతిరేకమే
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా తుస్..?
ఈసారి ఓటమి ఖాయమంటున్న విశ్లేషకులు
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections) కీలకఘట్టమైన పోలింగ్ ముగిసింది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ అభ్యర్థుల్లో టెన్షన్ సాధారణమే. కానీ గత ఎన్ని కల్లో బొటాబొటీ మెజార్టీతో గెలిచిన వైసీపీ (YSR Congress) అభ్యర్థుల్లో మాత్రం మరింత టెన్షన్ కనిపిస్తోంది. ఇందులో ప్రస్తుత శ్రీకాకుళం వైసీపీ అభ్యర్థి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) ముందువరుసలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ విజయం కన్నా.. మంత్రి ధర్మాన ఫలానా ఓట్ల తేడాతో ఓటమి పాలవుతున్నారన్న చర్చే ఎక్కువ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారంటే అందులో వైఎస్ జగన్‌కు ప్రజలు ఇచ్చిన ‘ఒక్కచాన్స్’ మాత్రమే. కానీ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు గత ఎన్నికల్లోనూ.. ధర్మాన ప్రసాదరావుకు ఆచితూచి ఓటేశారు. అప్పుడున్న పరిస్థితుల కారణంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 90 శాతం వైసీపీకే లభించాయి. వాటితో కలిపి లభించిన మెజార్టీ కేవలం 5,777ఓట్లు మాత్రమే. మొత్తం 69.19 శాతం ఓట్లు పోలవ్వగా... ఇందులో వైసీపీ అభ్యర్థి ధర్మానకు 47.43 శాతం, టీడీపీ అభ్యర్థి గుండ లక్ష్మిదేవికి 44.17 శాతం ఓట్లు లభించాయి. కేవలం 3.26 శాతం ఓట్లతో ధర్మాన విజయం సాధించారు. ఇక జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీచేసి.. 8,897ఓట్లను సాధించాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు టీడీపీతో కలిసి కూటమిగా ఉన్నాయి. దీంతో ఓటు బ్యాంకు మరింత పెరిగింది.
చేసిందేంటి..?
మరోవైపు ఈ ఐదేళ్ల వైసీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైంది. ఏ అభివృద్ధి చేపట్టకపోవడంతో శ్రీకాకుళం అర్బన్, రూరల్, గార మండల ప్రజలు మండిపడుతున్నారు. ధర్మాన ప్రసాదరావు.. మంత్రి పదవి చేపట్టినా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించలేదని ఆరోపిస్తున్నారు. ప్రధానంగా శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస వరకు రహదారిని బాగుచేయించలేక పోయారని, కేఆర్ స్టేడియాన్ని, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను పూర్తిచేయించలేక పోయారని పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల రోడ్లు కూడా ఎక్కడ చూసినా అధ్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే మొన్న ఎన్నికల్లో ఓట్ల రూపంలో వైసీపీకి బుద్ధి చెప్పారని.. తమకు అనుకూలంగా ఓటేశారని.. కూటమి నాయకులు ధీమాతో ఉన్నారు. ఇదిలా ఉండగా.. పోల్‌మేనేజ్మెంట్‌లో కూడా వైసీపీ కిందిస్థాయి నాయకులు.. వార్డులు, గ్రామాల్లో ఓటర్లకు సక్రమంగా డబ్బులు పంచకుండా.. సొంత లాభం చూసు కున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో ఓటు బ్యాంకు మరింత తగ్గిందనే ప్రచారం సాగుతోంది.
సీన్ రివర్స్..!
ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌బ్యాలెట్ ద్వారా 2019 ఎన్నికల్లో వైసీపీకి గంపగుత్తుగా ఓట్లు వేశారు. కాగా.. ఈ ఐదేళ్లలో సీన్ మారింది. ఉద్యోగులు సైతం వైసీపీ ప్రభుత్వ తీరుతో ఇబ్బందులు పడ్డారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్.. గద్దెనెక్కి ఐదేళ్లయినా ఆ హామీ నెరవేర్చలేదు. హామీల అమలుకోసం పోరాడిన ఉద్యోగు లపై వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ముందస్తు అరెస్టులతో కట్టడి చేసింది. దీంతో ప్రభుత్వ విధానాలపై ఉద్యోగులంతా ఆగ్రహంతో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో అధికశాతం మంది ఉద్యోగులు వైసీపీకి వ్యతిరేకంగా ఓటే శారని విశ్లేషకులు చెబుతున్నారు. శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్.. ధర్మానకు గట్టి పోటీ ఇచ్చారని పేర్కొంటున్నారు. టీడీపీ విజయం ఖాయమని, సుమారు 20వేల మెజార్టీ లభిస్తుందని కూటమి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతల్లో మాత్రం నైరాశ్యం కనిపిస్తోంది.
Read Latest AP News and Telugu News
సంచలన హామీ ఇచ్చిన ప్రధాని మోదీ
Updated Date - May 20 , 2024 | 01:32 PM