Apartment Balcony: అందంగా, ఆకర్షణీయంగా పెరిగే బాల్కనీ మొక్కలు ఇవే..!
ABN , Publish Date - Jan 23 , 2024 | 01:56 PM
మొక్కలకో బాల్కనీ అందంగా ఉండాలనుకునేవారు అలంకరణగా ఉండేందుకు పెద్దగా బాల్కనీ మీదకు పెరిగే మొక్కలను వేస్తుంటాం. ఇవి చక్కగా గుబురుగా పెరిగి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇందులో కొన్ని మొక్కలు ఆకర్షణగా బావుంటే, మరికొన్ని అలంకారంగానే కాదు
మొక్కలతో బాల్కనీ అందంగా ఉండాలనుకునేవారు అలంకరణగా ఉండేందుకు పెద్దగా బాల్కనీ మీదకు పెరిగే మొక్కలను వేస్తుంటాం. ఇవి చక్కగా గుబురుగా పెరిగి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇందులో కొన్ని మొక్కలు ఆకర్షణగా బావుంటే, మరికొన్ని అలంకారంగానే కాదు.. వాస్తుప్రకారం కూడా లక్ ని తెచ్చి పెట్టే మొక్కలున్నాయి. ఇందులో ముఖ్యంగా కొన్ని మొక్కలను గురించి తెలుసుకుందాం.
1. డెవిల్స్ ఐవీ మొక్క గురించి వినే ఉంటారు ఇది. మనీ ఫ్లాంట్ అనికూడా పిలుస్తారు. డెవిల్స్ ఐవీ నిగనిగలాడే, హృదయం ఆకారంలో ఉండే ఆకులతో ఉంటుంది. చాలామంది లక్కీ ఫ్లాంట్ గా ఈ మనీ ఫ్లాంట్ ని పెంచుకుంటూ ఉంటారు. బాల్కనీ గోడలకు, రెయిలింగ్లలో పెద్దగా పెరుగుతూ కనిపించే ఈ మొక్కను బాల్కనీ వాతావరణానికి సరైనది.
2. విస్టేరియా అందమైన పుష్పించే మొక్క. గుత్తులు గుత్తులుగా బాల్కనీ గోడలకు వేలాడుతూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి ఈ మొక్క పూలు. అలాగే బాల్కనీ గార్డెన్ లో అద్భుతంగా కనిపించే వైలెట్ పువ్వులను కలిగి ఉంటుంది. చక్కని వాసనతో ఆహ్లాదంగా ఉంటుంది.
3. బౌగెన్విల్లా.. ఇది కూడా కింద ఎక్కడైనా నాటి బాల్కనీ వరకూ పాకించేందుకు వీలుగా పెరుగుతుంది. అలాగే చక్కని ఆకర్షణీయమైన రంగులతో పూలు పూస్తుంది. అలాగే ఈ పూలు చాలా కాలం వాడిపోకుండా అందంగా కనిపిస్తాయి. గుత్తులుగా పూసే ఈ పూలను దూరం నుంచి చూస్తే రంగు రంగులుగా మబ్బలు ఆకాశం నుంచి కిందకి దిగినట్టుగా కనిపిస్తాయి.
ఇది కూడా చదవండి: బెండకాయను తింటే ఇన్ని బెనిఫిట్సా.. అవేంటంటే..!
4. పుష్పించే మొక్కలకు బాల్కనీ సరైనది. ఎందుకంటే బాల్కనీకి గులాబీ, తెలుపు వరకూ రకరకాల రంగుల పూలు అందంగా, కొత్త కళను తెస్తాయి. బోస్టన్ ఫెర్న్.. స్వోర్డ్ ఫెర్న్ అని పిలిచే ఈ మొక్క వికసించే పూలు పచ్చని ఆకులను కలిగి ఉంటుంది. ఇది పూర్తి సూర్యకాంతిలో వేగంగా పెరగుతుంది. ఇది బాల్కనీ వాతావరణంలో వేలాడదీయడానికి అనువైన మొక్కగా చెప్పవచ్చు.
5. బుర్రో..ఈ మొక్క పొడి వాతావరణంలో కూడా వేగంగా పెరుగుతుంది. ఒక రకమైన సక్యూలెంట్. ఇది తక్కువ పోషణతో కూడా చక్కగా పెరుగుతుంది. సూర్యరశ్మిలో బాగా పెరుగుతుంది. తక్కువ నీరు అవసరం అవుతుంది.