Share News

smart meters స్మార్ట్‌ మీటర్లతో ఉద్యోగాలు కోల్పోతున్నాం..

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:42 PM

smart meters స్మార్ట్‌ మీటర్ల వల్ల తాము ఉద్యోగాలు కోల్పోతున్నామని, దీని వల్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని విద్యుత్‌ మీటర్ల సంఘం నేతలు కోరారు.

smart meters   స్మార్ట్‌ మీటర్లతో ఉద్యోగాలు కోల్పోతున్నాం..
టెక్కలిలో ఆందోళన చేపడుతున్న మీటర్‌ రీడర్లు

ఆదుకోవాలని మీటర్‌ రీడర్ల ఆందోళన

పలాస/టెక్కలి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): స్మార్ట్‌ మీటర్ల వల్ల తాము ఉద్యోగాలు కోల్పోతున్నామని, దీని వల్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని విద్యుత్‌ మీటర్ల సంఘం నేతలు కోరారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం పలాస, టెక్కలిల్లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలాసలో ఏఐటీయూసీ పలాస డివిజన్‌ నాయ కుడు చాపర వేణుగోపాల్‌, మీటర్‌ రీడర్స్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్‌.కుమార స్వామి, కార్యదర్శి దూగాన భాస్కరరరావు మాట్లాడు తూ.. గడచిన 20 ఏళ్లుగా ఇంటింటికీ వెళ్లి విద్యుత్‌ బిల్లులను తీసుకుంటూ కాంట్రాక్టు కార్మి కులుగా పని చేస్తున్నారని.. అయితే స్మార్ట్‌ మీటర్ల వల్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, దీనివల్ల కుటుంబాలను ఎలా పోషించుకునేదని ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రభుత్వం స్పందించి సంస్థలో ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని కోరారు. అనంతరం సంబం ధిత అధికారులకు వినతిపత్రాలను అందించారు. కార్య క్రమాల్లో సంఘం పలాస డివిజన్‌ అధ్యక్షుడు బి.ఓం కార్‌, కార్యదర్శి కె.నరేష్‌, సోంపేట, పలాస, టెక్కలి సబ్‌ డివిజన్‌లకు చెందిన పలువురు మీటర్‌ రీడర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 11:42 PM