బాలికపై మేనమామ అకృత్యం
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:41 PM
కవిటి మండలంలోని ఓ గ్రామానికి చిందిన పదేళ్ల బాలికపై మేనమామ అకృత్యానికి పాల్పడ్డాడు.

కవిటి, మార్చి18(ఆంధ్రజ్యోతి): కవిటి మండలంలోని ఓ గ్రామానికి చిందిన పదేళ్ల బాలికపై మేనమామ అకృత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకు డికి గతంలో వివాహం జరిగింది. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్యానికి బానిసయ్యాడు. గ్రామంలో యువకుడి ఇంటికి కొద్ది దూరంలో బాలిక కుటుంబం నివసిస్తోంది. ఇటీవల బాలిక తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో శ్రీకాకుళంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలుసుకున్న సదరు యువకుడు బాలికపై ఈ నెల 11న అకృత్యానికి పాల్పడ్డాడు. ఈ తరుణంలో బాలిక ఇబ్బంది పడు తుండడంతో గ్రామస్థులు తల్లికి సమాచారమిచ్చారు. దీంతో కుటుంబ సభ్యు ల సహకారంతో సోమవారం రాత్రి కవిటి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి కేసును నమోదు చేస్తామని ఇచ్ఛాపురం సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు.
రెండు కేజీల గంజాయి స్వాధీనం
శ్రీకాకుళం క్రైం, మార్చి 18(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం హెచ్‌బీకాలనీ మైదా నంలో రెండు కిలోల గంజాయిని స్వాఽధీనం చేసుకుని ఓ యువకుడిని పోలీ సులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. నగర శివారులోగల తోట పాలెంకు చెందిన లొట్టి సురేష్ ఏపీహెచ్‌బీ కాలనీ మైదానంలో అనుమా నాస్పదంగా తిరుగుతున్నాడు. స్థానికులు ఆయన ప్రవర్తనపై అనుమానం తో పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ సిబ్బందితో వెళ్లి సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద రెండు కిలోల గంజాయి ప్యాకెట్టు లభ్యమైంది. దీంతో సురేష్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఇద్దరు యువకుల అరెస్ట్
శ్రీకాకుళంలోని అరసవల్లి జంక్షన్ 80 ఫీట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన ఇద్దరు యువకులు ఒకటో పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. స్థానిక మొండేటి వీధికి చెందిన డి.అఖిల్‌సాయి, ఎచ్చెర్ల మండలం ఏజీ పేటకు చెందిన భానుప్రసాద్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా గుర్తిం చిన స్థానికులు పోలీసులు సమాచారమిచ్చారు. దీంతో ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ, సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ద్విచక్రవాహనాలు దొంగతనం చేసినట్టు ఒప్పు కున్నారు. ఈ మేరకు తుప్పల్లో దాచి ఉంచిన ద్విచక్ర వాహనాలను చూపించారు. శ్రీకాకు ళం రూరల్ పరిధిలో రెండు వాహనాలు, ఎచ్చెర్లలో ఒకటి, రెండో పట్ట ణ పోలీసు స్టేషన్ పరిధిలో వాహనాన్ని చోరీ చేసినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు వారిపై కేసులను నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.