Share News

Viral News: ఇలాంటి చేపను మీరెక్కడా చూసి ఉండరు..

ABN , Publish Date - Aug 19 , 2024 | 06:54 AM

సాధారణంగా చేపల పొడవు ఎంతుంటుంది. మన చేతి పొడవంతో లేదా ఇంకా పెద్దవైతే మనిషి ఎత్తంతో ఉంటాయి. కానీ కోనసీమ జిల్లాలో మత్య్సకారులకు ఓ భారీ టేకి చేప దొరికింది.

Viral News: ఇలాంటి చేపను మీరెక్కడా చూసి ఉండరు..

కోనసీమ: సాధారణంగా చేపల పొడవు ఎంతుంటుంది. మన చేతి పొడవంతో లేదా ఇంకా పెద్దవైతే మనిషి ఎత్తంతో ఉంటాయి. కానీ కోనసీమ జిల్లాలో మత్య్సకారులకు ఓ భారీ టేకి చేప దొరికింది. అది ఎంతపెద్దదంటే.. ఒకరు ఇద్దరు లాగితే సముద్రంలో నుంచి ఇసుమంత కూడా కదల్లేదు. 30 మంది లాగినా బయటకు రాలేదు. చివరకు ఓ భారీ క్రేన్ సాయంతో దాన్ని అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు.

వెయ్యి కేజీల బరువున్న టేకి చేప గురించిన వివరాల్లోకి వెళ్తే.. కోనసీమ జిల్లా అంతర్వేది 18 అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారుల వలకు భారీ టేకి చేప చిక్కింది. దీన్ని ఎక్స్కవేటర్ సాయంతో బోటునుంచి వెలికి తీశారు. పశ్చిమ గోదావరి జిల్లా వేములదీవికి చెందిన బలగం వెంకటేశ్వర్లు చేపల బోటుపై కాకినాడ మత్స్యకారు లకు ఈ టికి చేప వలకు చిక్కింది. అంతర్వేది సముద్రంలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులు కు దొరికిన ఈ భారీ చేపను అతికష్టంపై బోటు సాయంతో హార్బరు వద్దకు తీసుకువచ్చారు.


30మంది జాలర్లు తాళ్లతో పైకి లాగినా రాకపోవడంతో ఎక్స్కవేటర్ సాయంతో హార్బర్ ప్లాట్అంతర్వేది పల్లిపాలెం మినీఫిషింగ్ హార్టరులో బోటునుంచి ఎక్స్కవేటర్ సాయంతో తెస్తున్న టేకి చేప ఫామ్‌కు తీసుకువచ్చారు. అంతర్వేదిలో తక్కువ ధర పలకడంతో కాకినాడ కుంభాభిషేకం రేవుకు వ్యాసుపై తీసుకువెళ్తామని మత్యకారులు తెలిపారు. అరుదైన ఈ చేపను చూడటానికి జనం తండోపతండాలుతగా తరలివచ్చారు. దాన్ని ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. వెయ్యి కిలోల పైబడి ఉండే ఈ భారీ టేకి చేపలు అరుదుగా వస్తాయని, వీటిని ముక్కలు కోసి ఉప్పు చేపగా అమ్ముతారని తెలిపారు.

For Latest News and National News click here

Updated Date - Aug 19 , 2024 | 01:05 PM