Funny Video: ఈ వీడియో చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే.. జేసీబీలతో ఎలా నాగినీ డ్యాన్స్ వేయించాడో చూడండి..
ABN , Publish Date - Jan 21 , 2024 | 09:12 AM
మనం తరచుగా రోడ్ల మీద పాములను ఆడించే వాళ్లను చూస్తుంటాం. వాళ్లు ఫ్లూట్ ఊదుతుంటే దానికి అనుగుణంగా పాములు న్యాటం చేస్తుంటాయి. ఆ నాగినీ డ్యాన్స్‌ను చాలా మంది ఆశ్చర్యపోయి చూస్తుంటారు. ఇక, సినిమాల్లో హీరోయిన్లు వేసే నాగినీ డ్యాన్స్‌లు చాలా మందిని ఆకట్టుకుంటాయి.

మనం తరచుగా రోడ్ల మీద పాములను (Snake) ఆడించే వాళ్లను చూస్తుంటాం. వాళ్లు ఫ్లూట్ ఊదుతుంటే దానికి అనుగుణంగా పాములు న్యాటం చేస్తుంటాయి. ఆ నాగినీ డ్యాన్స్‌ను (Naagin dance) చాలా మంది ఆశ్చర్యపోయి చూస్తుంటారు. ఇక, సినిమాల్లో హీరోయిన్లు వేసే నాగినీ డ్యాన్స్‌లు చాలా మందిని ఆకట్టుకుంటాయి. అయితే జేసీబీలు నాగినీ డ్యాన్స్‌లు వేయడం మీరెప్పుడైనా చూశారా? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే నవ్వు రాక మానదు (Funny Video). ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది (Viral Video).
jcb_nu_mathu95 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుర్రాడు జేసీబీల మధ్యలో కూర్చుని పూజ చేశాడు. అనంతరం పైకి లేచి ఫ్లూట్ ఊదడం మొదలుపెట్టాడు. బ్యాగ్రౌండ్‌లో 'నాగీనా' చిత్రంలోని 'మైన్ తేరీ దుష్మన్' పాట మ్యూజిక్ ప్లే అవుతుండగా చుట్టూ ఉన్న జేసీబీలు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. మ్యూజిక్‌కు అనుగుణంగా జేసీబీల ట్రంక్‌లు ఊగిపోయాయి. ఈ ఫన్నీ వీడియో చాలా మందిని ఆకట్టుకుంది (JCB Naagin Dance).
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు కోటి మందికి పైగా వీక్షించారు. ఏకంగా 41 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ``ఎన్నిసార్లు చూసినా నవ్వు వస్తోంది``, ``క్రియేటివిటీ పై స్థాయిలో ఉంది``, ``ఫన్నీ వీడియో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.