Shark Viral Video: సముద్రంలో కెమేరా మింగేసిన షార్క్.. లోపలి దృశ్యాలు చేస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
ABN , Publish Date - Feb 28 , 2025 | 09:43 PM
సముద్రం గర్భంలోని విషయాలను డైవర్లు కెమేరాలతో చిత్రీకరించి వాటిని బయటి ప్రపంచానికి తెలియచేస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మరింత అద్భుతాన్ని ఆవిష్కరించింది.

కొంతమంది సాహసవంతులు సముద్రలోతుల్లో డైవింగ్ (Divers) చేస్తూ మజా పొందుతుంటారు. సముద్ర (Sea) గర్భంలోని విషయాలను కెమేరాలతో చిత్రీకరించి వాటిని బయటి ప్రపంచానికి తెలియచేస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మరింత అద్భుతాన్ని ఆవిష్కరించింది. సముద్ర గర్భంలో డైవర్లపై దాడి చేయడానికి వచ్చిన ఓ షార్క్ (Shark) ఓ కెమెరా (Camera)ను మింగేసింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. సముద్ర గర్భంలో ఉన్న డైవర్ల దగ్గరకు ఓ షార్క్ వచ్చింది. ఓ ఇనుప ముక్కను మింగడానికి ప్రయత్నించింది. షార్క్ దాడి చేయడాన్ని చూసిన డైవర్లు దాని నోటిలో ఒక కెమెరాను విసిరారు. అది ఆ సమయంలో ఆన్‌లో ఉంది. ఆ కెమెరా షార్క్ కడుపు లోపల దృశ్యాన్ని రికార్డ్ చేసింది. షార్క్ శరీరం లోపలి భాగానికి చెందిన అద్భుతమైన దృశ్యం ఇప్పుడు ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ఆ తర్వాత ఆ కెమేరాను ఆ షార్క్ బయటకు ఉమ్మేసింది.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.6 లక్షల మందికి పైగా వీక్షించారు. 2.2 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది అత్యంత అరుదైనది``, ``ఈ ప్రకృతి ఎంతో అమోఘమైనది``, ``ఇది అద్భుతమైన ఫుటేజ్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Mother Video: తల్లి ప్రేమ రేంజ్ అదీ.. బిడ్డను కాపాడడం కోసం రక్తమోడిన అమ్మ.. వీడియో వైరల్..
Wife and Husband: అక్కడక్కడ ఇలాంటి మంచి భార్యలు కూడా ఉంటారు.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు చూస్తే..
Snake Viral Video: వామ్మో.. ఇది మామూలు ఫైట్ కాదు.. పాముల పోరాటం ఇంత భయంకరంగా ఉంటుందా?
Optical Illusion: మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ పుస్తకాల మధ్య తాళం చెవిని 5 సెకెన్లలో కనుగొనండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.