Viral Video: వరండాలో పడి ఉన్న పార్సిల్ కవర్.. అంతలో నడుస్తూ వచ్చిన చెత్త బ్యాగు.. చివరకు చూస్తే..
ABN , Publish Date - Apr 05 , 2024 | 04:58 PM
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చిన్న నేరం జరిగినా ఇట్టే పట్టుకునేందుకు అవసరమైన సదుపాయం ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో నేరస్థులను గుర్తించడం సులభంగా మారుతోంది. అయితే కొందరు దొంగలు కొన్నిసార్లు...
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చిన్న నేరం జరిగినా ఇట్టే పట్టుకునేందుకు అవసరమైన సదుపాయం ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో నేరస్థులను గుర్తించడం సులభంగా మారుతోంది. అయితే కొందరు దొంగలు కొన్నిసార్లు అతి తెలివితో వ్యవహరిస్తూ చోరీలకు పాల్పడుతుంటారు. ప్రధానంగా సీసీ కెమెరాలకు దొరక్కుండా ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వరండాలో ఉన్న పార్సిల్ కవర్‌ను ఎత్తుకెళ్లడానికి దొంగ వేసిన మాస్టర్ ప్లాన్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. యూకేలో (UK) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటి వరండాలో పార్సిల్ కవర్ (Parcel cover) పడి ఉంది. దాన్ని ఎలాగైనా ఎత్తుకెళ్లాలని ఓ దొంగ మాస్టర్ ప్లాన్ వేశాడు. అయితే ఆ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు (CC cameras) ఉండడంతో వెరైటీ ఐడియా ఉపయోగించాడు. చెత్తాచెదారాన్ని పడేసే ప్లాస్టిక్ కవర్‌ను తలపై కప్పుకొన్నాడు. చూడటానికి అచ్చం చెత్త వేసిన బ్యాగులా (garbage bag) మారిపోయాడు. తర్వాత మెల్లగా ఇంటి వరండా వద్దకు నడుచుకుంటూ వచ్చాడు.
Viral Video: ఆపదలో ఉన్న వారిని కాపాడటానికి దేవుడే రానక్కర్లేదు.. కొన్నిసార్లు ఇలాక్కూడా జరుగుతుంది..
వరండా వద్దకు వచ్చీ రాగానే ఇంటి ముందున్న పార్సిల్ కవర్‌ను లోపలికి తీసుకుని, యథావిధిగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎంత గమనించినా తనను ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ! ఇతడి తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: రంగు రంగు స్టిక్కర్లతో మ్యాజిక్ చేసిన యువతి.. స్కూటీని చివరకు ఎలా మార్చేసిందో చూడండి..