Share News

Optical Illusion: ఈ అడవిలో జింక ఎక్కడుందో 30 సెకన్లలో చెప్పగలరా..

ABN , Publish Date - May 03 , 2024 | 09:30 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్నింటికి సమాధానాలు వెతకడం కష్టంగా అనిపిస్తే.. మరికొన్నింటికి సులభంగా కనుక్కోవచ్చు. ఇలాంటి...

Optical Illusion: ఈ అడవిలో జింక ఎక్కడుందో 30 సెకన్లలో చెప్పగలరా..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్నింటికి సమాధానాలు వెతకడం కష్టంగా అనిపిస్తే.. మరికొన్నింటికి సులభంగా కనుక్కోవచ్చు. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలను సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడం వల్ల కాలక్షేపం, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం, మెదడకు వ్యాయామం అందడంతో పాటూ మనలో ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఇందుకోసం ప్రస్తుతం మీ ముందుకు ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న అడవిలో ఓ జింక దాక్కుని ఉంది. దాన్ని 30 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో మీరు ఓ పెద్ద అడవిని చూడొచ్చు. అందులో పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తాయి. అలాగే మరోపైపు కాలవలో నీళ్లు ప్రవహిస్తుంటాయి. అయితే ఇక్కడ మీకు వృక్షాలు, నీరు తప్ప ఇంకేమీ కనిపించదు. కానీ ఇక్కడే మీ ముందు ఓ టాస్క్ పెట్టబోతున్నాం. ఇదే అడవిలో వృక్షాల మాటున (deer hiding in the forest) ఓ జింక కూడా దాక్కుని ఉంది.

Viral video: యువతి డాన్స్ చూసి దిగాలుగా ఉన్న వధూవరులు.. అంతలో ఆమె తల్లి అక్కడికి రావడంతో..


అయితే ఆ జింకను అంత సులభంగా కనిపెట్టలేరు. కానీ కాస్త తీక్షణంగా పరిశీలిస్తే మాత్రం జింకను గుర్తించడం చాలా సులభం. చాలా మంది జింకను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే జింకను గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ జింకను గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఇప్పటికీ ఆ జింకను గుర్తించడం మీకు కష్టంగా అనిపిస్తే.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

optical-illusion-viral-phot.jpg

Puzzle: ఈ రెండు చిత్రాల్లో దాగున్న 3 తేడాలను.. 30 సెకన్లలో కనుక్కోగలరేమో ప్రయత్నించండి..

Viral Video: పెళ్లికొడుకును ఎక్కించుకున్న గుర్రం.. ఊరేగింపులో ఓ యువకుడు డాన్స్ వేయడం చూసి..

Updated Date - May 03 , 2024 | 09:30 PM