Share News

Viral Video: మీ కళ్లను మీరే నమ్మలేరు.. జేబు రుమాలు పాములా ఎలా మారిందో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్..

ABN , Publish Date - Oct 06 , 2024 | 03:08 PM

సాధారణంగా వేదికల మీద చాలా మంది మెజీషియన్స్ తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి హోటల్‌లో అందరి ముందు తన ట్యాలెంట్ ప్రదర్శించాడు. ఓ జేబు రుమాలుతో పామును సృష్టించాడు. కళ్ల ముందు జరిగిన కనికట్టును అక్కడున్న వారు విస్మయంగా చూశారు.

Viral Video: మీ కళ్లను మీరే నమ్మలేరు.. జేబు రుమాలు పాములా ఎలా మారిందో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్..
handkerchief turned as a snake

కనికట్టు (Magic) అనేది ఈ ప్రపంచంలో అత్యంత పురాతన విద్య. చాలా మంది చిన్న చిన్న ట్రిక్కులతో మ్యాజిక్ చేసి చూపిస్తారు. సామాన్యులెవరూ ఆ మ్యాజిక్ వెనుక ఉన్న వాస్తవాన్ని గుర్తించలేరు. సాధారణంగా వేదికల మీద చాలా మంది మెజీషియన్స్ (Magician) తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి హోటల్‌లో అందరి ముందు తన ట్యాలెంట్ ప్రదర్శించాడు. ఓ జేబు రుమాలుతో (Handkerchief) పామును (Snake) సృష్టించాడు. కళ్ల ముందు జరిగిన కనికట్టును అక్కడున్న వారు విస్మయంగా చూశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


@TheFigen అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి తన జేబులో నుంచి ఓ రుమాలును బయటకు తీశాడు. దానిని విప్పి అందరికీ చూపించాడు. ఆ తర్వాత టేబుల్‌పై ఆ రుమాలును పరిచాడు. టేబుల్‌పై ఉంచిన సాల్ట్‌ను దానిపై చల్లాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆ రుమాలు నుంచి పాము రావడం ప్రారంభమైంది. చివరకు రుమాలు మొత్తం పాములా మారిపోతుంది. ఆ పామును చూసిన ఓ అమ్మాయి భయంతో కేకలు వేసి పారిపోయింది. కళ్ల ముందు జరిగిన కనికట్టును చూసి అక్కడ కూర్చున్న వారందరూ షాక్ అయ్యారు. రెస్టారెంట్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ మాంత్రికుడి వైపు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.


ఆ మ్యాజిక్‌లో ఎక్కడా లీక్ అన్నది కనిపించలేదు. ఆ మాంత్రికుడు హాఫ్ టీ-షర్ట్ వేసుకుని ఉన్నాడు. అందువల్ల చొక్కా చేతుల నుంచి పాము వచ్చిందనుకోవడానికి వీల్లేదు. మరి, పాము ఎక్కడి నుంచి వచ్చిందో తెలియక చాలా మంది షాకవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.7 లక్షల మందికి పైగా వీక్షించారు. ఎన్నో వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఇది నిజంగా గొప్ప టెక్నిక్``, ``హఠాత్తుగా పాము ఎక్కణ్నుంచి వచ్చింది``, ``టేబుల్ కింద ఎవరైనా కూర్చుని పామును పైకి పంపారేమో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Picture Puzzle: మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ రెండు ఫొటోల్లోని మూడు తేడాలను 20 సెకెన్లలో కనుక్కోండి...


Viral Video: వావ్.. సూపర్ టెక్నిక్.. ఉడికించిన బంగళాదుంపల తొక్కలను ఎంత సింపుల్‌గా తీసిందో చూడండి..


Viral Video: పిచ్చి పీక్స్‌కు చేరితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి.. రీల్స్ కోసం చేసిన స్టంట్ చివరకు ఎలా ముగిసిందంటే..


Viral Video: ఇలాంటి భర్త దొరకాలంటే ఏ పూజలు చేయాలో..?, వధువుకు ఎలా వెల్కమ్ చెప్పాడో చూడండి..


Optical Illusion: మీ కళ్ల పవర్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో ``888`` మధ్య ఉన్న ``808``ని 8 సెకెన్లలో పట్టుకోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Oct 06 , 2024 | 03:08 PM