Viral Video: మొబైల్‌కి బానిసైతే ఇలాగే ఉంటుంది మరి.. నూడుల్స్ తింటున్న యువకుడు.. ఉన్నట్టుండి..
ABN , Publish Date - Apr 07 , 2024 | 04:55 PM
ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో పిల్లలు మొదలుకొని పెద్దల వరకు, నిరక్ష్యరాస్యులు మొదలుకొని పెద్ద పెద్ద చదువులు చదివినవారు కూడా ఫోన్లు లేకుండా ఉండలేని పరిస్థితి. కొందరైతే ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి. కొందరైతే...
ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో పిల్లలు మొదలుకొని పెద్దల వరకు, నిరక్ష్యరాస్యులు మొదలుకొని పెద్ద పెద్ద చదువులు చదివినవారు కూడా ఫోన్లు లేకుండా ఉండలేని పరిస్థితి. కొందరైతే ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి. కొందరైతే చివరకు భోజనం చేస్తున్న సమయంలోనూ, రాత్రి పడుకునే సమయంలోనూ ఫోన్ చూసుకుంటూనే ఉంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నూడుల్స్ తింటూనే మరోవైపు ఫోన్ చూసుకుంటుంటాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి హోటల్లో కూర్చుని నూడుల్స్ తింటుంటాడు. అదే సమయంలో చేత్తో ఫోన్ (Phone) పట్టుకుని ఏదో చూస్తూ ఉంటాడు. ఓ వైపు ఫోన్ చూస్తూ.. మరోవైపు నూడుల్స్ (Noodles) తింటుంటాడు. దృష్టి మొత్తం ఫోన్ పైనే పెట్టడం చూసి అతడి స్నేహితుడు అవాక్కవుతాడు. అతడు ఏ పరిస్థితిలో ఉన్నాడో కనుక్కునేందుకు ఓ ప్రయోగం చేస్తాడు.
Viral Video: తలపై కొబ్బరికాయను పగులగొట్టిన వ్యక్తి.. మరుక్షణంలో షాకింగ్ ట్విస్ట్..
పక్కనే ఉన్న టిష్యూ పేపర్ (tissue paper) తీసుకుని, దాన్ని నూడుల్స్ గ్రేవీలో ముంచి ఫోన్ చూస్తున్న వ్యక్తికి తినిపిస్తాడు. అప్పటికే ఫోన్‌లో మునిగిపోయిన అతను.. టిష్యూ పేపర్‌ను కూడా నూడుల్స్ అనుకుని తినేస్తాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది కదా ఏకాగ్రత అంటే’’.. అంటూ కొందరు, ‘‘ఫోన్ మాయలో పడితే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.80లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.