Share News

Viral Video: ఇద్దరూ హెల్మెట్లు పెట్టుకున్నారు.. అయినా తెలిసి తెలిసి చేసిన చిన్న తప్పుతో చివరకు ఏమైందో చూడండి..

ABN , Publish Date - Jan 02 , 2024 | 09:47 PM

ప్రయాణ సమయాల్లో కొందరు తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. దీంతో చివరకు ఊహించని ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా

Viral Video: ఇద్దరూ హెల్మెట్లు పెట్టుకున్నారు.. అయినా తెలిసి తెలిసి చేసిన చిన్న తప్పుతో చివరకు ఏమైందో చూడండి..

ప్రయాణ సమయాల్లో కొందరు తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. దీంతో చివరకు ఊహించని ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యువతీయువకులు ఇద్దరూ హెల్మెట్లు పెట్టుకుని, ఎల్ఈడీ టీవీ పట్టుకుని బైకులో బయలుదేరారు. అయితే వారు చేసిన చిన్న తప్పుతో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. యువతీయువకులు ఇద్దరూ హెల్మెట్లు పెట్టుకుని మరీ బైకులో బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ 50 అంగుళాల ఎల్ఈడీ టీవీ పట్టుకుని బయలుదేరారు. అయినా టీవీని సరైన పద్ధతిలో పట్టుకోకుండానే వెళ్లారు. మార్గ మధ్యలో వారిని కొందరు కారులో వెళ్తూ గమనిస్తుంటారు. వారు వెళ్లే క్రమంలో ఎదురుగా రోడ్డుకు మధ్యలో ఓ ఇనుప స్తంభం ఆర్చి ఉంది. బైకు నడుపుతున్న వ్యక్తి ఇదేమీ పట్టించుకోకుండా వెళ్తూనే ఉంటాడు. తీరా ఆర్చిని దాటే క్రమంలో ఎల్ఈడీ టీవీ.. స్తంభానికి తుగులుకోవడంతో కిందపడిపోతుంది.

Viral Video: పార్టీకి వెళ్లాక లీవ్ కోసం.. మధ్యలో బాస్‌కు మెసేజ్ చేసిన ఉద్యోగి.. అక్కడి నుంచి వచ్చిన సమాధానం చూస్తే..

టీవీని పట్టుకుని ఉన్న యువతి.. దాంతో పాటూ బైకుపై నుంచి వెనక్కు పడిపోతుంది. అయితే అంతలోనే బైకును నిలిపేయడంతో ఆమె పూర్తిగా కిందపడకుండా బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఈ ప్రమాదాన్ని చూసి కారులోని వారు షాక్ అవుతారు. ఈ ఘటనలో యువతికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో! ఎంత పని జరిగింది... ఆమెకు ఏమీ కాలేదు కదా’’.. అంటూ మరికొందరు, ‘‘అవగాహన లేకుండా డ్రైవింగ్ చేస్తే.. ఇలాగే జరుగుతుంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇతడి పావురం మ్యాజిక్ ట్రిక్‌ను పసిగట్టేసిన కెమెరా.. స్లోమోషన్‌లో చూస్తే.. అవాక్కయ్యే సీన్..

Updated Date - Jan 02 , 2024 | 09:47 PM