Australia vs Namibia: 5.4 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్.. ఊచకోత కోశారుగా!
ABN , Publish Date - Jun 12 , 2024 | 10:31 AM
క్రికెట్ మైదానంలో అప్పుడప్పుడు అద్భుతాలు చోటు చేసుకుంటుంటాయి. వికెట్లు లేదా పరుగుల పరంగా.. ఆయా జట్లు పెను సంచలనాలను నమోదు చేస్తుంటాయి. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌లోనూ...
క్రికెట్ మైదానంలో అప్పుడప్పుడు అద్భుతాలు చోటు చేసుకుంటుంటాయి. వికెట్లు లేదా పరుగుల పరంగా.. ఆయా జట్లు పెను సంచలనాలను నమోదు చేస్తుంటాయి. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌లోనూ (T20 World Cup) అలాంటి పరిణామమే వెలుగు చూసింది. నమీబియాతో (Namibia) జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia) ప్లేయర్లు అద్దిరిపోయే పెర్ఫార్మెన్స్ కనబరిచి.. ఆ జట్టుని చిత్తుగా ఓడించారు. మొదట బౌలర్లు నమీబియా బ్యాటింగ్ పతనాన్ని శాసించగా.. ఆ తర్వాత బ్యాటర్లు ఊచకోత కోశారు. కేవలం 5.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేధించి.. సూపర్-8కు అర్హత సాధించింది.
వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో.. తొలుత నమీబియా జట్టు టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది. అయితే.. ఆసీస్ బౌలర్ల ధాటికి ఆ జట్టు పేకమేడలా కుప్పకూలింది. 17 ఓవర్లలో 72 పరుగులకే ఆలౌట్ అయ్యింది. గెర్హార్డ్ ఎరాస్మస్ ఒక్కడే కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆదుకోవడానికి ప్రయత్నం చేశాడు. అతను 43 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అతని తర్వాత మైకేల్ 10 పరుగులతో రాణించాడు. మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. ఒక వికెట్ నష్టానికి 5.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని (74) ఛేధించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. డేవిడ్ వార్నర్ (20), ట్రావిస్ హెడ్ (34 నాటౌట్), మైకేల్ మార్ష్ (18) దుమ్ముదులిపేసి.. తమ జట్టుని విజయతీరాలకు చేర్చారు.
ఈ విజయంతో ఆస్ట్రేలియా రన్‌రేట్ (+3.580) భారీగా మెరుగుపడింది. ఈ విక్టరీతో ఆస్ట్రేలియా ఖాతాలో ఆరు పాయింట్లు చేరడంతో.. గ్రూప్-బీలో అది టేబుల్ టాపర్‌గా నిలిచింది. అంతేకాదు.. ఈ టోర్నీలో సౌతాఫ్రికా తర్వాత సూపర్-8కు అర్హత సాధించిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆడం జంపా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడంతో అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 12 పరుగులే ఇచ్చిన అతను నాలుగు వికెట్లు పడగొట్టాడు. జోష్ హాజిల్‌వుడ్, స్టోయినిస్ తలా రెండు వికెట్లు తీయగా.. కమిన్స్, ఎలిస్ చెరో వికెట్ తీశారు.
Read Latest Sports News and Telugu News