Share News

‘ఎర్రమట్టి’తో చెక్‌ పెట్టాలని!

ABN , Publish Date - Sep 15 , 2024 | 02:27 AM

ఆరు నెలల తర్వాత టీమిండియా టెస్టు ఫార్మాట్‌ బరిలోకి దిగబోతోంది. దీంట్లో భాగంగా ఈనెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగబోయే తొలి టెస్టు కోసం పకడ్బందీగా వ్యూహాలు రచిస్తోంది. ఎందుకంటే పాకిస్థాన్‌తో ఇటీవలే...

‘ఎర్రమట్టి’తో చెక్‌ పెట్టాలని!

పేస్‌ పిచ్‌ సిద్ధం

జోరుగా భారత బౌలర్ల ప్రాక్టీస్‌

19 నుంచి బంగ్లాతో తొలి టెస్టు

చెన్నై: ఆరు నెలల తర్వాత టీమిండియా టెస్టు ఫార్మాట్‌ బరిలోకి దిగబోతోంది. దీంట్లో భాగంగా ఈనెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగబోయే తొలి టెస్టు కోసం పకడ్బందీగా వ్యూహాలు రచిస్తోంది. ఎందుకంటే పాకిస్థాన్‌తో ఇటీవలే ముగిసిన రెండు టెస్టుల సిరీ్‌సను బంగ్లా క్లీన్‌స్వీ్‌ప చేసింది. అదే ఊపులో పటిష్ఠ టీమిండియాకు కూడా షాక్‌ ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. అయితే తమకన్నా బలహీన జట్టయినా బంగ్లాను రోహిత్‌సేన తక్కువగా చూడడం లేదు. అందుకే అద్భుతంగా రాణిస్తున్న వారి బౌలర్లకు ముకుతాడు వేసేందుకు చెపాక్‌లో ఎర్రమట్టితో కూడిన పిచ్‌ను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి చెన్నై పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. అటు బంగ్లాలో కూడా బంక మట్టి ఎక్కువగా ఉండే నల్లమట్టి పిచ్‌లపైనే ఆడతారు.


ఆరంభం నుంచే ఇవి స్పిన్నర్లకు అనుకూలిస్తుంటాయి. అందుకే బంగ్లా బౌలర్లకు అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో ఎర్రమట్టి పిచ్‌లను సిద్ధం చేస్తున్నారు. ఇందులో క్లే తక్కువగా ఉంటుంది కాబట్టి ఆరంభంలో బౌన్స్‌ రాబడుతూ పేసర్లు చెలరేగుతారు. అంతేకాకుండా ఈ ఏడాది చివర్లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. అక్కడి పిచ్‌ల దృష్ట్యా కూడా ఈ మార్పులు చేసినట్టు సమాచారం. అయితే నెట్స్‌లో గంభీర్‌, మోర్కెల్‌ ఆధ్వర్యంలో భారత స్పిన్నర్లు నల్లమట్టి.. పేసర్లు ఎర్రమట్టి పిచ్‌లపై సాధన చేస్తున్నారు.'

పేసర్‌ గుర్నూర్‌ బ్రార్‌తో.. నెట్స్‌లో భారత బ్యాటర్లకు బంతులు వేసేందుకు ఆరున్నర అడుగుల పంజాబీ పేసర్‌ గుర్నూర్‌ బ్రార్‌ను ప్రత్యేకంగా రప్పించారు. బంగ్లా జట్టులో కూడా ఇదే ఎత్తుతో పేసర్‌ నహీద్‌ రాణా ఉన్నాడు. పాక్‌తో జరిగిన రెండో టెస్టులో నవీద్‌ 5 వికెట్లతో చెలరేగాడు. అతడి బౌన్స్‌ను భారత్‌ దీటుగా ఎదుర్కొనేందుకే బ్రార్‌ను ఎంపిక చేశారు. తొలి టెస్టు మొదలయ్యేదాకా అతడు జట్టుతో పాటు ఉంటాడు.


10-Sports.jpg

నాది చిన్న పాత్రే: మోర్కెల్‌

భారత క్రికెట్‌ అభివృద్ధి కోసం కొత్తగా ఎవరూ ఏమీ చేయాల్సిన అవసరం లేదని, తనంతట తానుగా ముందుకు వెళ్లే వ్యవస్థ ఏర్పాటైందని టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ మోర్కెల్‌ అభిప్రాయపడ్డాడు. ఈక్రమంలో జట్టు మరింత పటిష్టంగా తయారయ్యేందుకు ఏం చేయగలనో అదే చేస్తానని చెప్పాడు. ఏరకంగా చూసినా ఇందులో నాది చిన్నపాత్రేనని తెలిపాడు. రోహిత్‌, విరాట్‌, జడేజా, అశ్విన్‌, బుమ్రాలాంటి సూపర్‌ సీనియర్లు జట్టును ముందుండి నడిపిస్తారని, సహాయక సిబ్బందిగా వారికి అవసరమైన సలహాలు ఇవ్వడం కోచ్‌లుగా తమ బాధ్యతని స్పష్టం చేశాడు.

Updated Date - Sep 15 , 2024 | 02:27 AM