SRH vs GT Playing 11: సన్‌రైజర్స్ వర్సెస్ గుజరాత్.. ప్లేయింగ్ 11 అదిరిందిగా..
ABN , Publish Date - Apr 06 , 2025 | 04:31 PM
Sunrisers Hyderabad: ఐపీఎల్ కప్పు పోటీలో ఉండాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌లో నెగ్గాల్సిన పరిస్థితిలో ఉంది సన్‌రైజర్స్. ఇలాంటి తరుణంలో విన్నింగ్ మూమెంటమ్‌తో ఉన్న గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ పోరుకు సిద్ధమవుతోంది కమిన్స్ సేన. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి ప్లేయింగ్ 11తో బరిలోకి దిగుతున్నాయో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ తాజా సీజన్‌ను గ్రాండ్ విక్టరీతో స్టార్ట్ చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. మంచి విజయంతో అభిమానుల్లో ట్రోఫీపై ఆశలు రేపింది. ఈసారి 300 కొట్టేస్తామంటూ ఊరించింది. కానీ రెండో మ్యాచ్ నుంచే టీమ్ డీలాపడిపోయింది. వరుసగా హ్యాట్రిక్ ఓటములతో ఫ్యాన్స్ ఆశలు నీరుగారేలా చేసేసింది. 300 ముచ్చట దేవుడెరుగు.. ముందు గెలవండి అనే స్థితికి వచ్చేసింది ఎస్‌ఆర్‌హెచ్. ఇవాళ గుజరాత్ టైటాన్స్‌తో జరిగే పోరులో గనుక ఓడితే ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో సండే ఫైట్‌లో సన్‌రైజర్స్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుంది.. ప్రత్యర్థి జీటీ తుదిజట్టు ఎలా ఉండనుందో కూడా చూద్దాం..
ఇద్దరిలో ఒక్కరికే చాన్స్
వరుస ఓటములు ఎదురువతున్నా సన్‌రైజర్స్ టీమ్ మేనేజ్‌మెంట్ ప్లేయర్లపై భరోసా ఉంచుతోంది. లాస్ట్ మ్యాచ్‌లో ఆడిన టీమ్‌ను తిరిగి దింపుతోందని.. వాళ్లతోనే రచ్చ చేయాలని చూస్తోందని తెలుస్తోంది. అదే నిజమైతే.. హెడ్, అభిషేక్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారు. ఇషాన్, నితీష్ రెడ్డి, క్లాసెన్ మిడిలార్డర్ బాధ్యతలు చూసుకుంటారు. కమిందు మెండిస్, అనికేత్ వర్మ ఫినిషింగ్ రోల్ తీసుకుంటారు. కెప్టెన్ కమిన్స్, హర్షల్, షమి, సిమర్జీత్ పేస్ రెస్పాన్సిబిలిటీస్ పంచుకుంటారు. స్పిన్నర్ రోల్ కమిందుదే. ఇంకో స్పిన్నర్ కావాలనుకుంటే సిమర్జీత్ బదులు జీషాన్‌ను తీసుకోవచ్చు.
వాళ్ల మీదే భారం
గుజరాత్ టీమ్ కూడా ప్లేయింగ్ 11లో పెద్దగా మార్పులు చేయలని భావించడం లేదట. సాయి సుదర్శన్, గిల్ ఓపెనర్లుగా వస్తారు. బట్లర్ రూథర్ ఫోర్డ్, షారుక్ ఖాన్ మిడిలార్డర్ బాధ్యతలు తీసుకుంటారు. గిల్, సుదర్శన్, బట్లర్ మీదే టీమ్ గంపెడాశలు పెట్టుకుంది. ఇక, తెవాటియా, రషీద్ ఖాన్ ఫినిషర్లుగా వ్యవహరిస్తారు. సాయి కిషోర్ ప్రధాన స్పిన్నర్‌గా ఆడటం ఖాయం. ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, సిరాజ్ పేస్ బాధ్యలు పంచుకోవడం పక్కా.
ప్లేయింగ్ 11:
హైదరాబాద్ (అంచనా)
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్, కమిందు మెండిస్, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, సిమర్జీత్ సింగ్/జీషన్ అన్సారీ
ఇంపాక్ట్ ప్లేయర్: ఆడమ్ జంపా
గుజరాత్ (అంచనా)
సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ (సారథి), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫేర్ రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.
ఇంపాక్ట్ ప్లేయర్: గ్లెన్ ఫిలిప్స్/అర్షద్ ఖాన్
ఇవీ చదవండి:
ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ జీటీ.. లెక్కలు తేలుస్తారా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి