Share News

Rohit Sharma: రోహిత్ శర్మకు ఏమైంది.. అందుకు కారణమేంటి?

ABN , Publish Date - May 04 , 2024 | 09:21 PM

శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగడంపై రకరకాల అనుమానాలు తెరమీదకి వస్తున్నాయి. అసలెందుకు రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు?

Rohit Sharma: రోహిత్ శర్మకు ఏమైంది.. అందుకు కారణమేంటి?

శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగడంపై రకరకాల అనుమానాలు తెరమీదకి వస్తున్నాయి. అసలెందుకు రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు? అందుకు గల కారణాలేంటి? అని రకరకాలుగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అసలు టీ20 వరల్డ్‌కప్ దగ్గర పడుతున్న సమయంలో.. రోహిత్‌కు ఏమైందంటూ అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే.. ముంబై ఇండియన్స్ స్పిన్నర్ పియూష్ చావ్లా అతని పరిస్థితిపై క్లారిటీ ఇచ్చాడు. అతనికి వెన్నునొప్పి ఉందని, అందుకే ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడని తెలిపాడు. ‘‘రోహిత్ తేలికపాటి వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఒకవేళ అతను మ్యాచ్ ఆడితే, ఆ సమస్య మరింత తీవ్రమవుతుందని మేనేజ్‌మెంట్ భావించింది. అందుకే.. ముందస్తు చర్యల్లో భాగంగా రోహిత్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా రంగంలోకి దింపడం జరిగింది’’ అని పియూష్ చావ్లా చెప్పుకొచ్చాడు. అతను చెప్పినట్లు సమస్య పెద్దది కాదు కాబట్టి.. రోహిత్ ఫిట్‌నెస్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది.


హార్దిక్ పాండ్యాకు షాక్.. అతడి స్థానంలో ఆ క్రికెటర్‌ను..

ఇదే సమయంలో.. ముంబై ఇండియన్స్ వరుస వైఫల్యాల గురించి కూడా పియూష్ మాట్లాడాడు. ఇప్పుడు ప్లేఆఫ్స్‌‌కి దారి పూర్తిగా మూసుకుపోయింది కాబట్టి, ముంబై జట్టు ఆడేందుకు ఇంకేం మిగిలి ఉందని ప్రశ్నించగా.. పేరు, ప్రఖ్యాతల కోసమని బదులిచ్చాడు. ఒక్కసారి మైదానంలో అడుగుపెట్టిన తర్వాత.. ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవుతామా? లేదా? అనే ధ్యాస ఉండదని.. పేరు నిలబెట్టుకోవడం కోసం పోరాటం చేస్తూనే ఉండాలని అన్నాడు. జట్టు ప్రయోజనాల కోసం ఆడటమే ఆటగాళ్ల ప్రథమ కర్తవ్యమని, మిగిలిన ఆటల్లో నెగ్గేందుకు ప్రయత్నిస్తామని పియూష్ చావ్లా చెప్పుకొచ్చాడు.

అదే ముంబై ఇండియన్స్ కొంపముంచింది

కాగా.. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై జట్టు కేవలం మూడు విజయాలే నమోదు చేసింది. మిగతా 8 మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాల్ని చవిచూసింది. దీంతో.. ఈ జట్టు ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఎప్పుడూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లను ముచ్చెమటలు పట్టించే ముంబై.. ఈసారి మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. ఏ విభాగంలోనూ మెరుగ్గా రాణించలేకపోతోంది. సీజన్ ప్రారంభంలో బలమైన పోటీ ఇవ్వగలిగింది కానీ, ఆ తర్వాతి నుంచి బలహీన పడుతూ వచ్చింది.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 04 , 2024 | 09:21 PM