ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ACB Inspections : అధ్వాన హాస్టళ్లు

ABN, Publish Date - Aug 14 , 2024 | 04:26 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో చాలావరకూ అపరిశుభ్రంగా ఉన్నాయని, విద్యార్థులు ఉంటున్న గదుల్లో తగినంత గాలి, వెలుతురు ఉండట్లేదని, వారికి రక్షిత తాగునీరు ఇవ్వట్లేదని.. వంటగదులు మురికిగా, మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయని.. నిబంధనల ప్రకారం విద్యార్థులకు రోజూ ఇవ్వాల్సిన కోడిగుడ్లు, పాలు ఇవ్వకపోగా, గడువు ముగిసిన (ఎక్స్‌పైర్డ్‌) ఆహార పదార్థాలను ఇస్తున్నారని అవినీతి నిరోధక సంస్థ (ఏసీబీ) తనిఖీల్లో వెల్లడైంది.

  • అపరిశుభ్రమైన వంటగదులు.. అసహ్యంగా మరుగుదొడ్లు

  • ఆహార మెనూ, రక్షిత మంచి నీటి సరఫరా.. ఏవీ లేవు

  • కోడిగుడ్లు, పాలు పంపిణీ ఫైళ్లకు మాత్రమే పరిమితం

  • సరుకుల కొనుగోళ్లలో పలు అవకతవకలు, అక్రమాలు

  • విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపిస్తున్న వైనం

  • వారానికోసారి లేదా నెలకోసారి మాత్రమే వార్డెన్ల రాక

  • రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లలో ఏసీబీ తనిఖీల్లో వెలుగులోకి

  • సర్కారుకు నివేదిక, మెరుగైన చర్యలకు సిఫారసులు: ఏసీబీ

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో చాలావరకూ అపరిశుభ్రంగా ఉన్నాయని, విద్యార్థులు ఉంటున్న గదుల్లో తగినంత గాలి, వెలుతురు ఉండట్లేదని, వారికి రక్షిత తాగునీరు ఇవ్వట్లేదని.. వంటగదులు మురికిగా, మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయని.. నిబంధనల ప్రకారం విద్యార్థులకు రోజూ ఇవ్వాల్సిన కోడిగుడ్లు, పాలు ఇవ్వకపోగా, గడువు ముగిసిన (ఎక్స్‌పైర్డ్‌) ఆహార పదార్థాలను ఇస్తున్నారని అవినీతి నిరోధక సంస్థ (ఏసీబీ) తనిఖీల్లో వెల్లడైంది.

ఇవే కాదు.. రిజిస్టర్లు/రికార్డులను సరిగ్గా నిర్వహించకపోవడం, సరుకుల కొనుగోళ్లలో అవకతవకలు, కొన్ని హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపించడం, వార్డెన్లు వారానికో నెలకో ఒకసారి వచ్చిపోవడం.. ఇలా ఎన్నో అక్రమాలు బయటపడ్డాయి.

ఏసీబీకి చెందిన 10 బృందాలు మంగళవారం రాష్ట్రంలోని పది వసతి గృహాలను ఏక కాలంలో తనిఖీ చేశాయి. ఒక్కో బృందంలో ఏసీబీ అధికారులతో పాటు తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఆడిటర్‌ ఉన్నారు. తనిఖీల్లో బయటపడ్డ అవకతవకలు, అక్రమాలకు బాధ్యులైన అధికారులపై నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని ఏసీబీ తెలిపింది. హాస్టళ్లలో పరిస్థితులను మెరుగుపరచడానికి తగిన సిఫారసులు చేస్తామని వెల్లడించింది.


ఎన్నో సమస్యలు..

రాజధాని హైదరాబాద్‌లోని జాంబాగ్‌ ఎస్సీ బాలుర హాస్టల్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి బీసీ బాలుర వసతి గృహం సహా పది హాస్టళ్లలో ఏసీబీ బృందాలు తనిఖీ చేశాయి.

  • జాంబాగ్‌ ఎస్సీ బాలుర హాస్టల్‌లో వసతులు సరిగ్గా లేవని, నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

  • ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని గాంధీనగరం ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులకు విద్యార్థులు పలు ఫిర్యాదులు చేశారు. తమకు మెనూ ప్రకారం భోజనం అందట్లేదని.. నీళ్ల చారు, ఉడికీ ఉడకని అన్నం పెడుతున్నారని వాపోయారు. పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంతో దోమలు పెరిగిపోయి జ్వరాలబారిన పడుతున్నామని ఆవేదన వెలిబుచ్చారు. మరుగుదొడ్లు దుర్వాసన వస్తున్నాయని, నిద్రించే సమయంలో ఎలుకలు తమను కరుస్తున్నాయని చెప్పారు. వంటగదిని పరిశీలించిన అధికారులు.. అక్కడంతా ఈగలతో నిండిపోయి, అపరిశుభ్రంగా కనిపించడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఉపాధ్యాయులు చెప్పాపెట్టకుండా సెలవు పెట్టారని.. ఉదయం 8గంటలు దాటినా వార్డెన్‌ రాలేదని గుర్తించారు.

  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఇప్పలపల్లి మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల శుభ్రంగా లేదని.. 356మంది విద్యార్థులకు సరిపడా సదుపాయాలు లేవని ఏసీబీ అధికారులు గుర్తించారు.

  • మంచిర్యాల జిల్లా వేమనపల్లిలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 272 మంది విద్యార్థులకుగాను 172 మంది విద్యార్థులే ఉన్నట్లు.. బియ్యం వాడకంలో తేడాలున్నట్లు గుర్తించారు. పాఠశాలలో సరైన పారిశుధ్య ఏర్పాట్లు లేవని తెలిపారు.


  • మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ హాస్టల్‌లో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు.. విద్యార్థులకు పెట్టిన అల్పాహారం నాణ్యంగా లేదని, పల్లీలు, కందిపప్పు, రాగులు, కూరగాయలు, నాసిరకంగా ఉన్నాయని తెలిపారు. బియ్యంలో పురుగులు ఉన్నాయని, విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదని.. గదులు, బాత్‌రూంలు అపరిశుభ్రంగా ఉన్నాయని, బాత్‌రూంలకు తలుపులు లేవని.. రికార్డుల నమోదు సక్రమంగా లేదని చెప్పారు. వార్డెన్‌ అందుబాటులో లేరని, ఫోన్‌ చేస్తే స్విచ్‌ఆ్‌ఫ అని వస్తోందని.. వెల్లడించారు.

  • సిద్దిపేటలోని ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్‌లో రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించట్లేదని గుర్తించారు.

  • నల్లగొండ జిల్లా తిప్పర్తిలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో 52 మంది విద్యార్థులు ఉన్నట్లుగా రికార్డుల్లో పేర్కొన్నా.. వాస్తవానికి ఉన్నది 23 మందిమాత్రమే అని తేలింది. గ్రామంలో ఇంటి వద్ద ఉంటున్న విద్యార్థినులు కూడా హాస్టల్‌లో ఉంటున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. హాస్టల్‌ వాటర్‌ట్యాంక్‌ అపరిశుభ్రంగా ఉందని, మరుగుదొడ్లు సరిపడా లేవని వెల్లడించారు. విద్యార్థులకు అల్పాహారం పెట్టట్లేదని.. బాలికలకు నెలనెలా ఇచ్చే కాస్మోటిక్స్‌ వివరాలను రెండు నెలలుగా రికార్డుల్లో నమోదుచేయట్లేదని పేర్కొన్నారు.

    జనగామ ఎస్సీ బాలికల హాస్టల్‌లో.. హాజరుపట్టీలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు, క్షేత్రస్థాయిలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు తేడా ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆహార మెనూను కూడా పాటించట్లేదని అధికారులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. హాస్టల్‌కు వచ్చే బియ్యం, పప్పులు, గుడ్లు, చింతపండు తదితర వస్తువులకు సంబంధించిన స్టాక్‌ రిజిస్టర్‌ను కూడా సరిగ్గా నిర్వహించట్లేదని.. వార్డెన్‌ రాత్రి పూట విధులకు హాజరు కావట్లేదని అధికారులు వెల్లడించారు.

Updated Date - Aug 14 , 2024 | 04:29 AM

Advertising
Advertising
<