ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: 41ఏళ్ల తర్వాత ఆదిలాబాద్‌కు ప్రధాని.. సీఎం రేవంత్ స్వాగతం

ABN, Publish Date - Mar 04 , 2024 | 12:36 PM

Telangana: జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. సోమవారం ఉదయం జిల్లాకు చేరుకున్న ప్రధానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన సభలో మోదీ పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రామగుండం ఎన్‌టీపీసీ పవర్ ప్లాంట్ ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు.

ఆదిలాబాద్, మార్చి 4: జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narender Modi) పర్యటన కొనసాగుతోంది. సోమవారం ఉదయం జిల్లాకు చేరుకున్న ప్రధానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రి సీతక్క (Minister Seethakka) స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన సభలో మోదీ (Prime Minister) పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రామగుండం ఎన్‌టీపీసీ పవర్ ప్లాంట్‌ను (Ramagundam NTPC Power Plant) ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు. దాదాపు రూ.6వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే ఆరు ప్రాజెక్టులకు వర్చువల్‌గా మోదీ శంకుస్థాపన చేశారు. అండర్‌ డ్రైనేజ్‌ కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్‌- బేల- మహారాష్ట్ర రోడ్డు విస్తరణ పనులు, రైల్వే విద్యుదీకరణ మార్గానికి ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేశారు. ఒక ప్రధాన మంత్రి ఆదిలాబాద్‌కు రావడం 41 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌గా కమిన్స్..ఈసారి టైటిల్ మనదేనా?


రాష్ట్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి: కిషన్‌రెడ్డి

ఈ సందర్భంగా కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రామగుండంలో యూరియా కంపెనీని మోదీ ప్రారంభించారని తెలిపారు. వరంగల్‌లో వ్యాగన్‌ తయారీ కంపెనీకి శంకుస్థాపన చేశారన్నారు. రాష్ట్రంలో రూ.30 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, తెలంగాణ నుంచి మూడు వందేభారత్‌ రైళ్లు ప్రారంభించారన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి...

Supreme Court: ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 04 , 2024 | 12:38 PM

Advertising
Advertising