ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి

ABN, Publish Date - Aug 21 , 2024 | 03:18 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పూర్తిస్థాయి కమిషనర్‌గా ఆమ్రపాలి కాట నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) జాయింట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.

  • హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌గా శ్రీవత్స

  • హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ ఎండీగా సర్ఫరాజ్‌

  • మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌

  • ఎండీగా దానకిశోర్‌కు అదనపు బాధ్యతలు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పూర్తిస్థాయి కమిషనర్‌గా ఆమ్రపాలి కాట నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) జాయింట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.

దీంతో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న ఆమెను రెగ్యులర్‌ కమిషనర్‌గా నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్‌ఎండీఏ జేసీగా ఆమె స్థానంలో జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ కోట శ్రీవత్సను నియమించింది.

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్‌కు మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌డీసీఎల్‌) ఎండీగా, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌కు హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.

ఇప్పటి వరకు ఈ రెండు పోస్టుల్లో ఆమ్రపాలి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. నారాయణ్‌పేట్‌ అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) మయాంక్‌ మిట్టల్‌ను హైదరాబాద్‌ వాటర్‌ బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమించింది.

Updated Date - Aug 21 , 2024 | 03:18 AM

Advertising
Advertising
<