ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amrapali: వర్షం పడితే బయటకు రావొద్దు..

ABN, Publish Date - Sep 25 , 2024 | 09:21 AM

భారీ వర్షాలు పడినప్పుడు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాట(GHMC Commissioner Amrapali Kata) నగరవాసులను కోరారు. పిల్లలు, వృద్ధులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపైకి రాకుండా కుటుంబసభ్యులు చూసుకోవాలన్నారు.

- పిల్లలు, వృద్ధులు ఇళ్లలోనే ఉండాలి

- వరద నీళ్లున్న ప్రాంతాలకు వెళ్లకండి: ఆమ్రపాలి

హైదరాబాద్‌ సిటీ: భారీ వర్షాలు పడినప్పుడు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాట(GHMC Commissioner Amrapali Kata) నగరవాసులను కోరారు. పిల్లలు, వృద్ధులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపైకి రాకుండా కుటుంబసభ్యులు చూసుకోవాలన్నారు. రోడ్లపై వరదనీరు నిలిచి ట్రాఫిక్‌ ఇబ్బందులు పెరిగే అవకాశమున్న దృష్ట్యా.. ఇళ్లలోనే ఉండడం మంచిదని పేర్కొన్నారు. మంగళవారం భారీ వర్షం కురిసిన నేపథ్యంలో వెంటనే ఆమె స్పందించారు. జోనల్‌, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులతో మాట్లాడారు. మాన్‌సూన్‌ బృందాలు క్షేత్రస్థాయిలో పని చేసేలా చూడాలని, వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా ఉండాలని, మ్యాన్‌హోల్‌, క్యాచ్‌పిట్‌ మూతలు తెరవవద్దని సూచించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: 2 రెమ్మలు.. 2 వేలు.. నాణ్యత, బరువులో తేడా రాకుండా సరఫరా


..............................................................

ఈ వార్తను కూడా చదవండి:

..............................................................

Kodandaram: దసరా నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

- ఎమ్మెల్సీ కోదండరాం

హైదరాబాద్: అపరిష్కృతంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్‌ ఆఫీసర్లు, టీచర్స్‌, వర్కర్స్‌ అండ్‌ పెన్షనర్ల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోదండరాం(MLC Kodandaram) తెలిపారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్‌ ఆఫీసర్స్‌, టీచర్స్‌ అండ్‌ వర్కర్స్‌, పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో కోదండరాంను ఘనంగా సత్కరించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు, ఆరోగ్యకార్డులు, పీఆర్సీ తదితర విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, దసరా వరకు తీపికబురు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


317 జీవో బాధితులకు న్యాయం చేయాలని..కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఉద్యోగులతో చర్చించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు తిప్పర్తి యాదయ్య, శ్రీపాల్‌రెడ్డి, చావ రవి, జ్ఞానేశ్వర్‌, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

ఇదికూడా చదవండి: రేవంత్‌రెడ్డి.. కోర్టుకు రండి!

ఇదికూడా చదవండి: తెలంగాణలో రేవంత్‌ కుటుంబం దోపిడీ

Read Latest Telangana News and National News

Updated Date - Sep 25 , 2024 | 09:21 AM