ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మా 5 గ్రామాలను తెలంగాణలో విలీనం చెయ్యండి..

ABN, Publish Date - Jul 05 , 2024 | 04:16 AM

ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకలగూడెం గ్రామపంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ ఆయా గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి.

  • ఎటపాక మండలంలోని పంచాయతీల తీర్మానం

  • మంత్రి తుమ్మలకు వినతిపత్రం అందజేత

హైదరాబాద్‌, కొత్తగూడెం, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకలగూడెం గ్రామపంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ ఆయా గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో గురువారం కలిసిన ఆ పంచాయతీల ప్రతినిధులు తీర్మాన ప్రతులను అందజేశారు. త్వరలో ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్న నేపథ్యంలో తాము ఈ తీర్మానం చేసినట్టు వారు మంత్రికి తెలిపారు.


తమ గ్రామాలు తెలంగాణలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీలను తెలంగాణలో కలిపే విధంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మంలో గురువారం జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొన్న తమ్మినేని.. కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ద్వారా ఏకపక్షంగా భద్రాచలాన్ని ముక్కలు చేసిందని ఆరోపించారు.

Updated Date - Jul 05 , 2024 | 04:16 AM

Advertising
Advertising