ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Child Custody: పిల్లల సంరక్షణపై ప్రత్యేక దృష్టి

ABN, Publish Date - Dec 22 , 2024 | 05:25 AM

ఆంధ్రజ్యోతిలో ఈ నెల 13న ‘అధికారమా నీకు ఇంతటి కాఠిన్యమా?’ పేరిట వచ్చిన కథనం పై అధికారులు ఎట్టకేలకు స్పందించారు.

  • ‘అధికారమా నీకు ఇంతటి కాఠిన్యమా’ ఆంధ్రజ్యోతి కథనంపై సంక్షేమాధికారి స్పందన

  • అందులోని విషయాలన్నీ అవాస్తవాలంటూ ఆరోపణ

  • పిల్లల మానసిక స్థితిపై మాత్రం మౌనం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రజ్యోతిలో ఈ నెల 13న ‘అధికారమా నీకు ఇంతటి కాఠిన్యమా?’ పేరిట వచ్చిన కథనం పై అధికారులు ఎట్టకేలకు స్పందించారు. చట్టబద్ధంగా దత్తత తీసుకోలేదన్న కారణంగా, ఆరునెలల కిందట 13మంది పిల్లలను పెంచుతున్న అమ్మానాన్నల నుంచి తెలంగాణ స్త్రీ, శిశుసంక్షేమ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడం గురించి ఆ కథనంలో ఆంధ్రజ్యోతి ప్రస్తావించింది. తల్లిదండ్రుల ఆవేదనను, పిల్లల మానసిక స్థితిని అధికారులు పట్టించుకోవడంలేదని పేర్కొంది. దీనిపై స్పందిస్తూ, ఆ కథనంలోని అంశాలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమైనవని పేర్కొంటూ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా సంక్షేమాధికారి పేరుతో శనివారం జవాబు పంపారు. శిశువిహార్‌లో పిల్లలకు రోజూ పెట్టే ఆహార పట్టిక వివరాలతో పాటు అక్కడున్న వైద్యసేవలు తదితర సౌకర్యాల గురించి అందులో ప్రస్తావించారు.


తమ స్వాధీనంలో ఉన్న పిల్లల సంరక్షణలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు కూడా వెల్లడించారు. అయితే ఆరునెలలుగా తమను పెంచిన తల్లిదండ్రులకు దూరంగా ఉన్న పిల్లల ప్రస్తుత మానసిక పరిస్థితి గురించి మాత్రం కనీస ప్రస్తావన చేయలేదు. కడుపున పుట్టకున్నా, ఆ పిల్లలమీదే పంచప్రాణాలు పెట్టుకొన్న పెంచిన తల్లిదండ్రుల ఆవేదనను.. ఊహ తెలిసిన నాటి నుంచి తాము తల్లితండ్రులుగా భావించిన వారికి దూరంగా శిశువిహార్‌లో ఉంటున్న పిల్లల మానసిక, శారీరక ఆరోగ్య స్థితులకు అధికారులు విలువ ఇవ్వడంలేదన్నది అంతిమంగా ఆంధ్రజ్యోతి కథనం ప్రధాన ఉద్దేశం. దీనిపై వివరణ ఇవ్వడం మాని, కథనంలోని అంశాలన్నీ అవాస్తవాలంటూ మరొకసారి అధికారులు తమ కాఠిన్యాన్ని ప్రదర్శించారు.

Updated Date - Dec 22 , 2024 | 05:25 AM