Bandi Sanjay: కాంగ్రె్‌సకు బీఆర్‌ఎస్‌కు తేడా లేదు..
ABN, Publish Date - Jul 01 , 2024 | 03:01 AM
పార్టీ ఫిరాయింపుల్లో బీఆర్‌ఎ్‌సకు, కాంగ్రె్‌సకు తేడా లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే సర్కారు నిధులు
పక్షపాతం వల్లే బీఆర్‌ఎ్‌సకు ఓటమి
కేంద్రమూ అలాగే చేస్తే తెలంగాణ
పరిస్థితి ఏంటి..?: బండి సంజయ్
భగత్‌నగర్(కరీంనగర్)/హుస్నాబాద్ రూరల్, జూన్ 30: పార్టీ ఫిరాయింపుల్లో బీఆర్‌ఎ్‌సకు, కాంగ్రె్‌సకు తేడా లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు, నిధుల కేటాయింపు, సింగరేణి ప్రైవేటీకరణపై దుష్ప్రచారం వంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్ బాటలోనే నడుస్తోందన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి విషయం లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రమే సర్కారు నిధులిస్తోందని విమర్శించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇలానే పక్షపాతం చూపితే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా అలా చేస్తే తెలంగాణ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
రాష్ట్ర మంత్రులు కేంద్రాన్ని కలిస్తే సర్కారు పూర్తిగా సహకరిస్తోందన్నారు. తెలంగాణలో జనసేనతో పొత్తుపై పవన్ కల్యాణ్ తన ప్రతిపాదనను బీజేపీ ముందుంచారని, దీనిపై పార్టీ అధినాయకత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. భారత్ టీ-20 వరల్డ్ కప్ గెలవడం పట్ల సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. కాగా, దళారీ వ్యవస్థకు మోదీ సర్కార్ వ్యతిరేకమని, కమీషన్లు తీసుకుంటే ఖబర్దార్ అని సంజయ్ హెచ్చరించారు. కరీంనగర్‌లో పీఎం విశ్వకర్మ యోజన కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలు ఆయనకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంజ య్ మాట్లాడారు. కొంతమంది దళారులు పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.
‘కార్పొరేట్ల’ చేతిలో ప్రభుత్వాలు..
కార్పొరేట్ సంస్థలు ఇచ్చే డబ్బుతో నేడు ప్రభుత్వాలు నడిచే దుస్థితి ఏర్పడిందని సంజయ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆదివారం శిశు మందిర్ విద్యాసంస్థ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. కార్పొరేట్ విద్యాసంస్థల వల్ల చిన్న విద్యాసంస్థలు చిన్నాభిన్నం అయ్యాయ న్నారు. కార్పొరేట్ సంస్థలతో సంస్కృతి, సంప్రదాయాలు మంటగలిసిపోతున్నాయని పేర్కొన్నారు. తాను శిశు మందిరంలోనే చదివానని సంజయ్ తెలిపారు.
Updated Date - Jul 01 , 2024 | 03:01 AM