ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Medigadda barrage.: 20వ పిల్లర్‌ ముందు గొయ్యి

ABN, Publish Date - May 25 , 2024 | 03:43 AM

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాకు పిల్లర్‌ నెం.20 వద్ద బ్యారేజీ లోపలి భాగంలో నలుగురు మనుషులు పట్టేంత పెద్ద గొయ్యి పడింది. ఇది మేడిగడ్డ కింద ఏర్పడిన అగాధంలో భాగమని భావిస్తున్నారు. గురువారం సాయంత్రం 16వ నంబరు గేటు ఎత్తే ప్రయత్నంలో భారీ శబ్దాలు వచ్చిన తర్వాత బ్యారేజీలో జలాశయం వైపు ఇసుక కుంగి, ఈ గొయ్యి కనిపించింది.

  • మేడిగడ్డ 16వ నంబరు గేటు ఎత్తగా భారీశబ్దం

  • దాంతో పాటే ఈ గొయ్యి ఏర్పడిందని అంచనా

  • లోపల నలుగురు మనుషులు పట్టే పరిమాణం

  • గేట్లు ఎత్తేప్పుడు మరిన్ని గోతులకు అవకాశం?

హైదరాబాద్‌, మహదేవపూర్‌ రూరల్‌, మే 24: మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాకు పిల్లర్‌ నెం.20 వద్ద బ్యారేజీ లోపలి భాగంలో నలుగురు మనుషులు పట్టేంత పెద్ద గొయ్యి పడింది. ఇది మేడిగడ్డ కింద ఏర్పడిన అగాధంలో భాగమని భావిస్తున్నారు. గురువారం సాయంత్రం 16వ నంబరు గేటు ఎత్తే ప్రయత్నంలో భారీ శబ్దాలు వచ్చిన తర్వాత బ్యారేజీలో జలాశయం వైపు ఇసుక కుంగి, ఈ గొయ్యి కనిపించింది. గొయ్యి చుట్టూ ఇసుక బస్తాలు పెట్టి, ఎవరు కూడా అటువైపు పోకుండా నియంత్రిస్తున్నారు. భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలను పూర్తి చేసిన తర్వాత మేడిగడ్డ కింద అగాధం సైజుపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. బ్యారేజీ కింద అగాధం కారణంగానే పిల్లర్లు కుంగాయని, గేట్లను ఎత్తే క్రమంలో మరిన్ని గోతులు పడే అవకాశం ఉందని ఓ అధికారి చెప్పుకొచ్చారు. గురువారం సాయంత్రం బ్లాక్‌-7లో 16వ నెంబరు గేటు ఎత్తేందుకు ప్రయత్నించగా భారీ శబ్దాలు రావడంతో ఆ పనిని నిలిపేశారు. ఆ శబ్దాలు ఏమై ఉంటాయనే దానిమీద ఆరా తీస్తున్నారు. మరోపక్క 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న గేట్లను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 20, 21 పిల్లర్ల మధ్య గేటును తొలగించే ప్రక్రియలో భాగంగా గేటుకు అదనంగా ఉండే బీడింగ్‌లను శుక్రవారం తొలగించారు. బ్లాక్‌-7కు దిగువన ఏర్పాటు చేసేందుకు షీట్‌ఫైల్స్‌ ఇప్పటికే బ్యారేజీకి చేరుకున్నాయి.


ఆంక్షల వలయంలోకి మేడిగడ్డ బ్యారేజీ

మేడిగడ్డ బ్యారేజీ ఆంక్షల వలయంలోకి వెళ్ళింది. వంతెనతో పాటు కుంగిన బ్లాక్‌-7 వద్దకు మీడియాను అనుమతించరాదని అనధికార నిషేధం విధించారు. గత అక్టోబరు 20న మేడిగడ్డ కుంగినపుడు కూడా అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అదే తోవలో నడిచినప్పటికీ తర్వాత కొన్నిరోజులకే ఆంక్షలు కొద్దిమేర సడలించింది. మంత్రులు తరచుగా రావడంతో ఆంక్షలను పూర్తిగా సడలించారు. ప్రస్తుతం బ్యారేజీ బ్లాక్‌-7లో గేట్ల ఎత్తివేతకు చర్యలు ముమ్మరంగా సాగుతుండడం, బ్యారేజీ పిల్లర్ల కింద భారీ అగాధం ఉందనే వార్త ఆంధ్రజ్యోతిలో ప్రచురితమవ్వడంతో అధికారులు లోనికి వెళ్లేందుకు అనుమతులను రద్దు చేసినట్లు తెలిసింది. అధికారులను ప్రశ్నిస్తే ఆంక్షలు ఏం లేవని చెబుతూనే నిర్మాణ సంస్థ సిబ్బందితో లోనికి వెళ్ళకుండా అడ్డగిస్తున్నారు. తెలంగాణ వైపు గేట్లను మూసివేసి సీఆర్‌ఫీఎఫ్‌ సిబ్బందితో తనిఖీలు చేయిస్తున్నారు.


మరమ్మతులు ప్రారంభం

మేడిగడ్డ బ్యారేజీమరమ్మతు పనులు ఊపందుకున్నాయి. బ్యారేజీ ఎగువ, దిగువభాగాల్లో దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇసుక బస్తాలను అమర్చారు. శుక్రవారం 21వ నంబరు పిల్లరుకు ముందు పునాదికి బోర్‌ హోల్‌ డ్రిల్లింగ్‌ ప్రారంభించారు. డ్రిల్లింగ్‌ పూర్తయ్యాక పరీక్షలు జరిపి, పునాదిని బలోపేతం చేయడానికి చర్యలు చేపడతారు. మూడు బ్యారేజీల మరమ్మతుపై ఈఎన్‌సీ(జనరల్‌) ఛైర్మన్‌గా నలుగురు అఽధికారులతో వేసిన కమిటీ తొలి సమావేశం శనివారం జలసౌధలో జరుగనుంది.

Updated Date - May 25 , 2024 | 03:43 AM

Advertising
Advertising