ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Etela Rajender: బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే నష్టమే తప్ప, లాభం లేదు..

ABN, Publish Date - Apr 20 , 2024 | 03:44 PM

Telangana: ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు తోడు దొంగల పార్టీలని విమర్శించారు. కేసీఆర్ అహంకారంతో సహచర మంత్రులను, నాయకులను, ప్రజలని మర్చిపోయారని.. ఫలితంగా చిత్తుగా ఓడిపోయారని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే నష్టమే తప్ప, లాభం లేదని.. రాష్ట్రానికి ఒరిగేదేమి లేదన్నారు.

BJP Leader Etela Rajender

కామారెడ్డి, ఏప్రిల్ 20: ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రధానిగా మోదీ (PM Modi) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ (BJP Leader Etela Rajender) అన్నారు. శనివారం జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రం లో నిర్వహించిన సమావేశంలో ఈటెల మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు తోడు దొంగల పార్టీలని విమర్శించారు. కేసీఆర్ (BRS Chief KCR) అహంకారంతో సహచర మంత్రులను, నాయకులను, ప్రజలని మర్చిపోయారని.. ఫలితంగా చిత్తుగా ఓడిపోయారని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌కు (హఇథ) ఓటు వేస్తే నష్టమే తప్ప, లాభం లేదని.. రాష్ట్రానికి ఒరిగేదేమి లేదన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ (Congress) రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని దుయ్యబట్టారు.

AP Elections: నెల ముందే జీతం.. అదనంగా డబుల్ బోనస్.. వాలంటీర్ల రాజీనామా వెనుక అసలు కథ..


ఆ పథకాలకు అడ్డుపడ్డది కేసీఆరే...

రెండు లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి రైతులను పూర్తిగా మోసం చేశారన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేసే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి లేదని.. అతనితో కాదన్నారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పిన హామీ సైతం లేదన్నారు. 17 సీట్లు గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని అంటున్న రేవంత్ రెడ్డికి చెప్తున్నా... జీవితంలో ప్రధానిగా రాహుల్ అవ్వడం పగటి కలనే అంటూ ఎద్దేవా చేశారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను, ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవాలని చూస్తున్నారు తప్ప.. ప్రజల సంక్షేమం కోసం పనిచెయ్యట్లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు రాష్ట్రంలో అమలు కాకుండా అడ్డుపడ్డది కేసీఆర్ అని అన్నారు.

TG Politics: నన్ను టచ్‌ చేస్తే మాడి మసైపోతావ్.. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్


500 ఏళ్లుగా దేశ ప్రజలు ఎదురు చుసిన అయోధ్యలోని రామలయాన్ని కేవలం రెండేళ్లలోనే నిర్మించిన ఘనత ప్రధాని మోదీకి దక్కిందన్నారు. ప్రపంచ దేశాలలో భారత దేశ కీర్తి ప్రతిష్టలను పెంచిన వ్యక్తి నరేంద్ర మోదీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే స్కామ్‌లు... బీజేపీ అంటే అభివృద్ధికి బాటలు అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని.. బీబీ పాటిల్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

Telangana: విషాదం.. అత్తింటి వేధింపులు తాళలేక.. ఆల్ అవుట్ లిక్విడ్ తాగి..

BRS: గులాబీ పార్టీలో గుబులు.. కారు దిగేందుకు మరో ఎమ్మెల్యే సిద్ధం..?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 20 , 2024 | 03:48 PM

Advertising
Advertising