TG News: కవిత అరెస్ట్‌పై బీజేపీ నేతలు ఏమన్నారంటే..
ABN, Publish Date - Mar 15 , 2024 | 07:17 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (MLC Kavitha) ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. అయితే ఈ విషయంపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (MLC Kavitha) ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. అయితే ఈ విషయంపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ విచారణకు కవిత సహకరించాలని సూచించారు. ఇన్నాళ్లు విచారణకు సహకరించకుండా కవిత తప్పించుకుని తిరిగారని అన్నారు. సహకరించలేదు కాబట్టే.. ఈడీనే ఆమె ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసిందని తెలిపారు. కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. విచారణ సంస్థలు తమ పని తాము చేసుకుని పోతాయని కిషన్‌రెడ్డి అన్నారు.
కవితపై కక్ష సాధింపులకు దిగాల్సిన అవసరం బీజేపీకి లేదు: ఈటల రాజేందర్
కవితపై కక్ష సాధింపులకు దిగాల్సిన అవసరం బీజేపీ (BJP) కి లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు. ఈడీ విచారణకు ఆమె సహకరించాలని కోరారు. ఈడీ అధికారులు వారి పని వారు చేసుకుని పోతారని చెప్పారు. దేశంలో విచారణలు మెదటసారి జరగటం లేదన్నారు. ఈడీ దగ్గరున్న ఆధారాలను బట్టి విచారణలు జరుపుతారని ఈటల రాజేందర్ అన్నారు.
ఇవి కూడా చదవండి
Big Breaking: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
Kavitha Arrest: కవిత అరెస్ట్‌పై ఈడీ అధికారులను నిలదీస్తున్న కేటీఆర్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 15 , 2024 | 07:17 PM