BRS: గవర్నర్ దృష్టికి పార్టీ ఫిరాయింపుల వ్యవహారం..
ABN, Publish Date - Jul 20 , 2024 | 05:24 AM
పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు బీఆర్‌ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసేందుకు శనివారం అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
నేడు కలవనున్న బీఆర్‌ఎస్ నేతలు
హైదరాబాద్, జూలై19 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు బీఆర్‌ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసేందుకు శనివారం అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ముఖ్య నేతలు గవర్నర్‌ను కలిసి.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నాయి.
అదేవిధంగా ఎమ్మెల్యేల ప్రొటోకాల్ ఉల్లంఘన, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలకు కాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధిత అధికారులు ప్రాధాన్యం ఇవ్వడాన్ని కూడా నేతలు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. దీంతోపాటు ఇటీవల నిరుద్యోగులపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టడం, వరుస హత్యోదంతాలు, రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై కూడా ఫిర్యాదు చేయనున్నారు.
Updated Date - Jul 20 , 2024 | 05:24 AM