KTR: రైతులను కాంగ్రెస్ సర్కార్ దగా చేసింది
ABN, Publish Date - May 24 , 2024 | 03:32 PM
రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం నకిరేకల్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నకిరేకల్‌కు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రుణ మాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులను దగా చేశాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నల్గొండ: రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం నకిరేకల్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నకిరేకల్‌కు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రుణ మాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులను దగా చేశాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ. 2,683 రూపాయల మద్దతు ధర ఇస్తామని ప్రకటన చేశారు. సన్న వడ్లకు మాత్రమే ఇస్తానని చెప్పి మోసం చేస్తున్నారని వివరించారు.
వడ్ల విషయంలోనే కాదు ప్రతీ అంశంలో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కేటీఆర్ గుర్తుచేశారు. కరెంట్ విషయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. తమ హయాంలో కరెంటు సమస్య ఎలా ఉండెదో గుర్తుచేసుకోవాలని సూచించారు. ఇప్పుడు కరెంట్ కష్టాలతో రైతులకు ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని వివరించారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అని ఊదరగొట్టారు. అందులో ఇప్పటివరకు ఒక్కటే అమలు చేశారని కేటీఆర్ మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ రాలేదని కేటీఆర్ విమర్శించారు. నోటిఫికేషన్ రాలేదు.. గాడిద గుడ్డు వచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో మంజూరైన 30 వేల ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిందని గొప్పలు చెప్పుకుంటుదని విరుచుకుపడ్డారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతల సయోధ్య ఉండదని.. ఇక్కడ ఆ పార్టీ నేతల ఎవరి విధానాలు వారివే ఉంటాయని కేటీఆర్ ఆరోపించారు.
For More Telangana News and Telugu News..
Updated Date - May 24 , 2024 | 03:48 PM