ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loksabha Elections: ఖమ్మం రోడ్‌ షోలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Apr 19 , 2024 | 04:41 PM

Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది తెలంగాణ బీజేపీ. జాతీయ పెద్దలతో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రోడ్‌షోలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ..

Rajnath Singh Sensational Comments on BRS and Congress

ఖమ్మం జిల్లా, ఏప్రిల్ 19: పార్లమెంట్ ఎన్నికల్లో (Loksabha Elections) గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది తెలంగాణ బీజేపీ. జాతీయ పెద్దలతో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రోడ్‌షోలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ (Central Minister Rajnath Singh) పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) ఏర్పాటు కోసం, అభివృద్ధి కోసం ప్రజలు ఆశించారని.. బీఆర్‌ఎస్ అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టారన్నారు. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) రెండు అవినీతి పార్టీలే అని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం మాటలు ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు.

Delhi: భారతీయులు అనవసర ప్రయాణాలు వద్దు.. దుబాయి ఎంబసీ హెచ్చరిక


జమ్ము కాశ్మీర్ 369 ఆర్టికల్ లాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు చేశామని చెప్పారు. త్రిపుల్ తలాక్ ఎత్తేశామని... మహిళలకు గౌరవం ఉండాలని చట్టాలు చేశామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉమ్మడి పౌర చట్టం తీసుకుని వస్తామని హామీ ఇచ్చారు. మళ్ళీ మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు నెహ్రూ, ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేదరికం పోగడుతాం అన్నారని... దేశంలో పేదరికం పెరిగిందన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత పేదరికం పోయిందని అన్నారు.

Balakrishna: టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిని తట్టుకునే శక్తి ఎవరికీ లేదు


ప్రపంచ దేశాలు భారత్ ఏం చేయబోతుందని చూస్తున్నాయని... అంతటి గౌరవాన్ని మోది హయాంలో వచ్చిందని వెల్లడించారు. ఆర్ధిక స్థితిలో 11వ స్థానం నుంచి ఇప్పుడు 5 వ స్థానంలో ఉందన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతోందని... మోదీఅక్కడి తెలుగు వారిని కాపాడారన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో 70 సంవత్సరాలు దాటిన వారికి 5లక్షల రూపాయల ఉచిత వైద్యం అందించామన్నారు. బీజేపీని గెలిపించాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు.


ఇవి కూడా చదవండి...

CM Revanth: కేసీఆర్ కాలం చెల్లింది.. కారు షెడ్డుకు పోయింది.. సీఎం రేవంత్ వ్యంగ్యాస్త్రాలు

AP Elections: కోలాహలంగా కేశినేని చిన్ని ర్యాలీ.. కేశినేని నాని కార్యాలయం వద్దకు రాగానే...

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 19 , 2024 | 04:47 PM

Advertising
Advertising