ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జాతి గర్వించదగిన నేత వాజపేయి: ఏపీ సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Dec 26 , 2024 | 04:45 AM

భారతజాతి గర్వించదగిన నేత వాజపేయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు.

  • సదైవ్‌ అటల్‌ వద్ద వాజపేయికి ఘననివాళి

న్యూఢిల్లీ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): భారతజాతి గర్వించదగిన నేత వాజపేయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. వాజపేయి శత జయంతి సందర్భంగా బుధవారం ఉదయం వాజపేయి సమాధి ‘సదైవ్‌ అటల్‌’ వద్ద రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో కలిసి సీఎం చంద్రబాబు ఘననివాళి అర్పించారు.


ఈ సందర్భంగా సీఎం ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘నేషన్‌ ఫస్ట్‌’ అని ఎప్పుడూ భావించే వాజపేయితో కలిసి పనిచేసిన అనుభూతి తనకు చిరకాలం గుర్తుండిపోతుందన్నారు. దేశం గురించి వాజ్‌పేయి ఆలోచించే తీరు విలక్షణమైనదని, దానికి ఆధునికత, సాంకేతికత జోడించాలని తాను సూచించినప్పుడు, సంస్కరణల గురించి ప్రతిపాదనలు చేసినప్పుడు ఆయన స్పందించిన తీరును ఎన్నటికీ మరచిపోలేనని అన్నారు. వాజపేయితో తాను దిగిన ఫొటోను చంద్రబాబు పంచుకున్నారు.

Updated Date - Dec 26 , 2024 | 04:46 AM