ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Revanth Reddy: మతచిచ్చుకు మోదీ యత్నం

ABN, Publish Date - May 12 , 2024 | 03:58 AM

హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏనాడు చూడని విధంగా.. రక్తపాతం, కత్తులతో నరుక్కోవడం, మతాలు, కులాలుగా సమాజం విడిపోయేలా వైషమ్యాలను రెచ్చగొట్టేలా దుష్టశక్తులు పనిచేస్తున్నాయన్నారు.

  • మునుపెన్నడూ లేని విధంగా విద్వేష కుట్రలు

  • అల్లర్లతో పెట్టుబడులు వెనక్కి వెళ్లే ప్రమాదం

  • ప్రాజెక్టుల్లో ప్రజలను ముంచిన దుర్మార్గుడు వెంకట్రామారెడ్డి.. అతడికి బీఆర్‌ఎస్‌ టికెటా?

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజం

  • రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ల రద్దు బీజేపీ అజెండా

  • పదేళ్ల బీఆర్‌ఎస్‌, బీజేపీ పాలనలో ఇచ్చిందేమీ లేదు :రేవంత్‌

సంగారెడ్డి/పటాన్‌చెరు/తాండూరు/ హైదరాబాద్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏనాడు చూడని విధంగా.. రక్తపాతం, కత్తులతో నరుక్కోవడం, మతాలు, కులాలుగా సమాజం విడిపోయేలా వైషమ్యాలను రెచ్చగొట్టేలా దుష్టశక్తులు పనిచేస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బ తింటే పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయా? అని సీఎం ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు పటాన్‌చెరు, తాండూరు, కామారెడ్డిలలో నిర్వహించిన కాంగ్రెస్‌ బహిరంగసభలు, రోడ్‌షోలలో రేవంత్‌ ప్రసంగించారు.


బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి, రిజర్వేషన్లను రద్దు చేయడమే ఎజెండాగా బీజేపీ పని చేస్తోందని.. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలు ఈ కుట్రను అర్థం చేసుకోవాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన అన్ని లోక్‌సభ ఎన్నికలు అభివృద్ధి, ప్రజాసంక్షేమం ఎజెండాగా జరిగాయని సీఎం గుర్తు చేశారు. ఈ ఎన్నికలు మాత్రం.. భారతీయులకు హక్కులనిచ్చి, పేదల తలరాతలు మార్చిన అంబేద్కర్‌ రాజ్యాంగానికి ఎసరు పెట్టేలా స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగిన నేపథ్యంలో జరుగుతున్నాయని చెప్పారు. పదేళ్లలో రాష్ట్రానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు చేసింది శూన్యమన్నారు.


పటాన్‌చెరు వరకు మెట్రోరైలు, ఐటీఐఆర్‌, మూసీ రివర్‌ డెవల్‌పమెంట్‌కు నిధులు, బయ్యారం ఉక్కు కర్మాగారం, వరంగల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఇలా ఏదీ ఇవ్వకుండా గాడిద గుడ్డు మాత్రం ఇచ్చిన మోదీ తెలంగాణ ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు, విమానాశ్రయం, ఐఐటీ, చివరకు పటాన్‌చెరు బస్‌టెర్మినల్‌ను సైతం కాంగ్రెస్‌ ప్రభుత్వాలే నిర్మించాయన్నారు. స్వర్గీయ ఇందిరమ్మ చలవతోనే మెదక్‌ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని.. బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌, ఓడీఎఫ్‌, ఇక్రిశాట్‌ సంస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవేనని వివరించారు.


ఈ ఎన్నికలు ప్రధాని మోదీ పరివార్‌, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ పరివార్‌ మధ్య జరుగుతున్న యుద్ధమని సీఎం అభివర్ణించారు. మోదీ పరివార్‌ అంటే ఈడీ, ఐటీ, సీబీఐ, ఢిల్లీ పోలీసులు, అదానీ, అంబానీలని.. రాహుల్‌గాంధీ పరివార్‌ అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరమ్మ, రాజీవ్‌గాంధీ, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ, ప్రియాంక గాంధీ, కోట్లాది కాంగ్రెస్‌ కార్యకర్తలన్నారు. ఈ ఎన్నికల్లో మోదీ పరివార్‌ను ఓడించి రాహుల్‌ పరివార్‌ను గెలిపించాలని సీఎం కోరారు.


ప్రజలను ముంచిన దుర్మార్గుడు వెంకట్రామారెడ్డి

బీఆర్‌ఎస్‌ పార్టీ మెదక్‌ అభ్యర్థి వెంకట్రామారెడ్డి.. ప్రాజెక్టుల పేరుతో అనేక గ్రామాల ప్రజలను ముంచిన దుర్మార్గుడని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. నిర్వాసితులను పోలీసులతో తన్నించి నేడు ఓట్లు అడుగుతున్నాడని విమర్శించారు. ‘వేల కోట్లు అడ్డంగా సంపాదించి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవిలో ఉన్న వెంకట్రామారెడ్డికి ఎంపీ పదవి అవసరమా? కేసీఆర్‌ పెగ్గు మత్తులో ఉండగా ఎంపీ టికెట్‌ ఇచ్చాడేమో? కేసీఆర్‌, హరీశ్‌రావులకు వందల కోట్లు ఇచ్చి మెదక్‌ ఎంపీ టికెట్‌ తెచ్చుకున్న వెంకట్రామారెడ్డి ప్రయత్నాలు ప్రజలు సాగనివ్వరు. అతడి సొమ్ము ప్రజలదే. పంచితే తీసుకుని, తూరుపు తిరగమని నడ్డిమీద వాతలు పెట్టి పంపండి’ అని ప్రజలకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - May 12 , 2024 | 03:58 AM

Advertising
Advertising