ఇది దొరల ప్రభుత్వం కాదు: భట్టి విక్రమార్క
ABN, Publish Date - Dec 01 , 2024 | 03:22 AM
గత ఏడాది కాలంగా రాష్ట్రంలో దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వం నడుస్తోంది. కానీ, బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం ‘ప్రజల వద్దకు పోతాం.. ఉద్యమం చేస్తాం.. నిలదీస్తాం’ అంటూ రకరకాల ప్రకటనలు చేస్తోంది.
గత ఏడాది కాలంగా రాష్ట్రంలో దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వం నడుస్తోంది. కానీ, బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం ‘ప్రజల వద్దకు పోతాం.. ఉద్యమం చేస్తాం.. నిలదీస్తాం’ అంటూ రకరకాల ప్రకటనలు చేస్తోంది. పదేళ్లలో వాళ్లు వ్యవసాయరంగాన్ని ధ్వంసం చేశారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు అలాగే ఉంటే.. కేసీఆర్ హయాంలో కట్టిన కాళేశ్వరం కుంగింది. కృష్ణా, గోదావరి ప్రాంతాల్లో వాళ్లు ఎడారిని చేస్తే.. మేం ఎస్‌ఎల్‌బీసీ, పీఆర్‌ఎ్‌సఐ పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నాం. పదేళ్లలో లక్ష రుణమాఫీ చేస్తే వడ్డీకే సరిపోయాయి. ఇచ్చిన మాట ప్రకారం రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశాం. పదేళ్లలో పంట నష్టపరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. మేం రూ.100 కోట్ల నష్టపరిహారం చెల్లించాం. రూ.1433 కోట్లతో రైతు బీమా సొమ్ము చెల్లించాం. డ్రిప్, స్పింక్లర్, పాలీహౌజ్, ఫామ్ మెకనైజేషన్, సబ్సిడీకి నిధులు కేటాయించాం. వ్యవసాయ రంగానికి రూ.73 వేల కోట్లు కేటాయింపులు చేస్తున్నాం.
ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను సరిచేశాం: తుమ్మల
రాష్ట్రంలో పదేళ్లపాటు జరిగిన ఆర్థిక, పాలన విధ్వంసాన్ని సరి చేశాం. పెను భారం మోస్తూ కూడా హామీలను అమలు చేస్తున్నాం. రైతు బీమా, మద్దతు ధర, రూ.2 లక్షల రుణమాఫీ వంటివి అమలు చేస్తున్నాం. రైతులంతా ఆయిల్‌పామ్ పంట వేయాలి. ఇంటి దగ్గరకే వచ్చి పంట ఉత్పత్తిని కొనుగోలు చేస్తారు. నాలుగేళ్లలో అన్ని జిల్లాల్లో పామాయిల్ ఫ్యాక్టరీలు పెడతాం.
నాడు రింగ్ రోడ్డు అమ్మి రుణమాఫీ: జూపల్లి
బీఆర్‌ఎస్ హయాంలో రింగ్ రోడ్డు అమ్మి.. రూ.11వేల కోట్ల రుణమాఫీ చేస్తే అది మిత్తికే సరిపోయింది. పాలమూరు బిడ్డ సీఎం కావడం ఇక్కడి ప్రజల అదృష్టం. వైఎస్ ఉన్నప్పుడు కేఎల్‌ఐ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, బీమా ప్రాజెక్టులను ప్రారంభించారు. అవి ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని అమలులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
సీఎం రేవంత్ దార్శనికత: దామోదర
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, ఎన్ని విపత్కర పరిస్థితులు ఉన్నా దార్శనికతతో సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీ చేశారు. దేశ చరిత్రలో ఇంతమొత్తంలో రుణమాఫీ చేసిన రాష్ట్రం లేదు. వ్యవసాయం దండగ కాదు పండగ అని వైఎ్‌సఆర్ నిరూపించారు. ఈ రోజు రేవంత్‌రెడ్డి కూడా సంవత్సరం లోపలే రైతు పండుగ నిర్వహించడం శుభపరిణామం. కులగణనతో సామాజిక సమానత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఏకకాలంలో రుణమాఫీ ఘనత కాంగ్రె్‌సదే: సీతక్క
దేశంలో ఏకకాలంలో 18 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత పాలమూరు బిడ్డ సీఎం రేవంత్‌రెడ్డిదే. బీఆర్‌ఎస్ నేతలు రుణమాఫీపై అవాకులు పేలుతున్నారు. 2018-23 మధ్య వారు 11 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారు. రాష్ట్రంలో అప్పుల కుప్ప ఉన్నప్పటికీ సంక్షేమంలో వెనక్కి తగ్గడం లేదు.
కాంగ్రె్‌సతోనే రైతు సంక్షేమం: మహేశ్ గౌడ్
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నుంచి రేవంత్‌రెడ్డి వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే రైతు సంక్షేమం జరిగింది. బీఆర్‌ఎస్ హయాంలో రైతు కంట కన్నీరు.. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో పన్నీరు అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ, మేం.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకకాలంలో రుణమాఫీ చేశాం. రాహుల్‌గాంధీ వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం.
Updated Date - Dec 01 , 2024 | 03:22 AM