ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: కాంగ్రెస్‌ ఇచ్చిందీ గాడిద గుడ్డే!

ABN, Publish Date - Jul 28 , 2024 | 04:47 AM

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందంటూ పార్లమెంటు ఎన్నికల ప్రచార సభల్లో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రముఖంగా ప్రస్తావించారు. బీజేపీకి తెలంగాణ 8 ఎంపీ సీట్లిస్తే.. కేంద్ర బడ్జెట్‌లో బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది?.. గాడిద గుడ్డు’ అంటూ ఇటీవల ఫ్లెక్సీలు వెలిశాయి.

  • కాంగ్రె్‌సకు నలుగురు ఎమ్మెల్యేలను ఇచ్చిన రంగారెడ్డి జిల్లాకు ఏమిచ్చారంటూ ప్రశ్న

  • గాడిద గుడ్డు అంటూ బీజేపీ ఫ్లెక్సీలు

  • లోక్‌సభ ఎన్నికల సమయంలో సీఎం నినాదాన్నే ఇప్పుడు అందుకున్న బీజేపీ

  • కేంద్ర బడ్జెట్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మాటల యుద్ధం

హైదరాబాద్‌, జూలై 27(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందంటూ పార్లమెంటు ఎన్నికల ప్రచార సభల్లో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రముఖంగా ప్రస్తావించారు. బీజేపీకి తెలంగాణ 8 ఎంపీ సీట్లిస్తే.. కేంద్ర బడ్జెట్‌లో బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది?.. గాడిద గుడ్డు’ అంటూ ఇటీవల ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కాంగ్రె్‌సకు నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే.. రాష్ట్ర బడ్జెట్‌లో ఆ ‘జిల్లాకు కాంగ్రెస్‌ ఏమిచ్చింది?.. గాడిద గుడ్డు’ అంటూ ఇప్పుడు హైదరాబాద్‌లో బీజేపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. కేంద్ర బడ్జెట్‌ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం డిమాండ్లు, కేంద్ర మంత్రి ఖండన వారి మాటల్లోనే..


రేవంత్‌ రెడ్డి: యూపీలో ఏడు, ఏపీలో రెండు సైనిక్‌ స్కూళ్లు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక సైనిక్‌ స్కూల్‌ ఉండాలి. కానీ తెలంగాణలో లేదు. సైనిక్‌ స్కూల్‌ ఇవ్వండని ప్రధాని మోదీకి, రక్షణ మంత్రి రాజనాథ్‌ సింగ్‌కు పదేపదే విజ్ఞప్తి చేశాం. అయినా పట్టించుకోలేదు.

కిషన్‌ రెడ్డి: 2016లో సైనిక్‌ స్కూల్‌ ప్రారంభించాం. కేంద్రం, రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకున్నా.. దాన్ని ఎందుకు అమలు చేయలేదో తెలపాలి. ఆ కాగితాలన్నీ బయటపెట్టాలి.


రేవంత్‌ రెడ్డి: గిరిజన యూనివర్సిటీని పూర్తిస్థాయిలో ప్రారంభించాలి. దీనిపై పార్లమెంట్‌లో ప్రధాని ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి.

కిషన్‌ రెడ్డి: గిరిజన వర్సిటీ మంజూరైంది. నిధులిచ్చాం. ఇంకా వర్సిటీకి రావాల్సిన 150 ఎకరాల భూమి గత ప్రభుత్వం ఇవ్వలేదు... ఈ ప్రభుత్వమూ ఇవ్వలేదు. అయినా నేను గతంలో కేసీఆర్‌ క్యాబినెట్‌లోని మంత్రులతో కలిసి ములుగు వెళ్లి తాత్కాలిక క్యాంపస్‌ ప్రారంభించాం.

రేవంత్‌ రెడ్డి: తెలంగాణలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మించాలి. దీనిపైనా పార్లమెంట్‌లో ప్రధాని నుంచి ఒక ప్రకటన రావాలని కోరుకుంటున్నాం.

కిషన్‌ రెడ్డి: ప్రధాని స్వయంగా ఖాజీపేట వచ్చి కోచ్‌, వ్యాగన్‌, ఇంజను ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసినా కనీసం అప్పటి సీఎం రాలేదు. ఇంకా కోచ్‌ ఫ్యాక్టరీ ఎక్కడ అంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు.


  • వ్యాగన్‌ ఫ్యాక్టరీకే శంకుస్థాపన!

ఖాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ ప్రారంభించాలని 1972 నుంచి డిమాండ్‌ ఉన్నా.. రెండు పర్యాయాలు కేటాయించినట్లే కేటాయించి ఇతర ప్రాంతాలకు తరలించారని, అలాగే ప్రత్యేక రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఉన్నా దానికీ కేంద్రం ఆమోదం తెలపడంలేదని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. ప్రధాని మోదీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖాజీపేటకు వచ్చి వ్యాగన్ల తయారీ పరిశ్రమ మాత్రమే ప్రారంభించారని, దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదని, కోచ్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తే సుమారు 70 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు. బీజేపీ నాయకులు చెబుతున్నట్లు మూడు పరిశ్రమలు ప్రారంభించలేదని కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 04:47 AM

Advertising
Advertising
<