ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదు.. భావోద్వేగం

ABN, Publish Date - Oct 01 , 2024 | 03:08 AM

ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదని భావోద్వేగం అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. నిరుద్యోగం అనే అంశం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉందని, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం సాగిందని పేర్కొన్నారు.

  • డీఎస్సీ ఫలితాల ప్రకటన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి

  • అభ్యర్థుల కుటుంబాల్లో దసరాకు ముందే పండగని వ్యాఖ్య

  • 9వ తేదీన ఎల్బీస్టేడియంలో నియామక పత్రాలు అందజేత

  • నేటి నుంచి ధ్రువపత్రాల తనిఖీ.. 1:1 నిష్పత్తిలో ఎంపిక

  • తర్వాత జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో వెబ్‌ ఆప్షన్లు.. పోస్టింగ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదని భావోద్వేగ ం అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. నిరుద్యోగం అనే అంశం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉందని, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం సాగిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ అని చెప్పారు. సోమవారం డీఎస్సీ-2024 ఫలితాలను సచివాలయంలో రేవంత్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. కేసీఆర్‌ పదేళ్ల పాలనలో కేవలం ఒకసారి డీఎస్సీ నిర్వహించి 7,857 పోస్టులు భర్తీ చే శారని, తమ ప్రజా ప్రభుత్వం పది నెలల్లోనే 11,062 పోస్టులకు డీఎస్సీ నిర్వహించిందని తెలిపారు. ప్రతి పోస్టుకు 1:3 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపడతామని వెల్లడించారు.


ఎంపికైన అభ్యర్థులకు అక్టోబరు 9వ తేదీన ఎల్బీ ేస్టడియంలో నియామక పత్రాలు అందజేస్తామని, ఆయా అభ్యర్థుల కుటుంబాల్లో దసరా పండగకు ముందే పండగ వాతావరణం నెలకొనేలా చేస్తామని పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత టెట్‌ నిర్వహించాలని నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తి వస్తే మరోసారి టెట్‌ నిర్వహించామని, ఫలితంగా డీఎస్సీ రాసేందుకు అదనంగా 1,09,168 మంది అభ్యర్థులు అర్హత సాధించారని గుర్తుచేశారు. డీఎస్సీ రాత పరీక్షలను జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు 26 సెషన్లలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించినట్లు తెలిపారు. డీఎస్సీ, టెట్‌ నిర్వహణలో సమర్థంగా వ్యవహరించారని, బాగా కష్టపడ్డారని విద్యా శాఖ అధికారులను అభినందించారు. కాగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు.


గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు వేర్వురుగా ఉండటంతో పిల్లల్లో ఆత్మనూన్యత భావం ఏర్పేడదని, దానిని తొలగించి వారి సమగ్ర వికాసానికి ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో రూ.వంద కోట్లతో ఒక్కో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటికే కొడంగల్‌, మధిర నియోజకవర్గాల్లో ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందని, ప్రైవేట్‌ కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కోళ్ల షెడ్లు, అద్దె గృహాల్లో వసతి గృహాలు ఏర్పాటు చేసిందని, కనీస మౌలిక వసతులు కల్పించలేదన్నారు. గత ప్రభుత్వం ఏళ్ల తరబడి టీచర్ల పదోన్నతులు, బదిలీలు చేపట్టలేదని.. తాము అధికారంలోకి వచ్చాక వివాదాలకు తావు లేకుండా 34,706 మంది టీచర్లకు బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టామని చెప్పారు.


  • నియామకాలే లక్ష్యంగా !

నిరుద్యోగులకు అండగా నిలవడం, ఉద్యోగ నియామకాలే లక్ష్యంగా తాము అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే 30వేల ఉద్యోగాల నియామక పత్రాలు అందించామని సీఎం పేర్కొన్నారు. ఉపాధ్యాయ పోస్టల భర్తీని 65 రోజుల్లోనే పూర్తి చేస్తున్నట్టు ప్రకటించారు. గ్రూప్‌ 1, 2, 3 పోస్టులను అంగడీ సరకుల్లా మార్చిన పీఎ్‌ససీని ప్రక్షాళన చేశామన్నారు. ఎటువంటి లోపాలు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే గ్రూపు-1 ఫలితాలను ప్రకటించి, వారిని కూడా తెలంగాణ పున ర్‌ నిర్మాణంలో భాగస్వామ్యులను చేస్తామన్నారు. మొత్తంగా మొదటి ఏడాదిలోనే 60వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు.


విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో మూసేయబోమని చెప్పారు. 317 జీవో సమస్య ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ప్రైవేట్‌ స్కూళ్లల్లో ఫీజుల నియంత్రణపై ప్రత్యేక కమిటీని వేసిన విషయాన్ని గుర్తు చేశారు. క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఏ విభాగంలో కూడా ఖాళీ పోస్టు లేకుండా నియామకాలను చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర, తుమ్మల, పొంగులేటి, కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, విద్యా శాఖ కమిషనర్‌ నరసింహారెడ్డి, అదనపు డైరెక్టర్‌ లింగయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.


  • నేటి నుంచి ధ్రువీకరణ పత్రాల పరీశీలన

ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా మంగళవారం నుంచి 5వ తేదీ వరకు జిల్లాల వారీగా అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ మేరకు సోమవారం అధికారులు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు సంబంధించి అభ్యర్థులకు ఈ-మెయిల్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం ఇస్తారు. ప్రతి పోస్టుకు ముగ్గురి చొప్పున అంటే... 1:3 నిష్పత్తిలో ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహి స్తారు.

  • సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ అనంతరం ప్రతి పోస్టుకు ఒక్కరి చొప్పున అంటే... 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డీఈవోల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగనుంది.

  • 1:1 జాబితాలో ఎంపికైన అభ్యర్థుల నుంచి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో వెబ్‌ ఆప్షన్లను తీసుకుంటారు. ఈ వెబ్‌ ఆప్షన్ల ఆధారంగా పోస్టింగ్‌లను ఇస్తారు. ఆ లోపు అభ్యర్థులకు నియామక ఉత్తర్వులను జారీ చేయనున్నారు.


  • డీఎస్సీ వివరాలు

మొత్తం 11,062 పోస్టుల భర్తీకి 2024, ఫిబ్రవరి 29న నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈ పోస్టుల కోసం మొత్తం 2,79,838 మంది అభ్యర్థులు దరఖాస్తులను చేసుకున్నారు. జూన్‌ 18 నుంచి ఆగస్టు 5వ తేదీల మధ్య 26 సెషన్స్‌లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబిటీ)లను నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 2,46,584 మంది అభ్యర్థులు అంటే... 88.11 శాతం మంది హాజరయ్యారు. అనంతరం ప్రాథమిక కీని విడుదల చేశారు. ఈ కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది కీని విడుదల చేశారు. ఈ తుది కీపై కూడా కొన్ని అభ్యంతరాలు నమోదయ్యాయి. దాంతో మళ్లీ ఈ అభ్యంతరాలను పరిశీలించి సోమవారం ఫలితాలను వెల్లడించారు. జిల్లాల వారీగా జనరల్‌ ర్యాంకుల జాబితాను ప్రకటించారు. ఈ ఫలితాలను http//schooledu.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లో అభ్యర్థులు పరిశీలించుకోవచ్చు.


  • హన్మాజిపేటవాసికి మొదటి ర్యాంకు

వేములవాడ రూరల్‌, సెప్టెంబరు 30: డీఎస్సీ ఫలితాల్లో సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌ మండలం హన్మాజిపేట గ్రామానికి చెందిన కోడం చంద్రశేఖర్‌ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. స్కూల్‌ అసిస్టెంట్‌ ఇంగ్లిషు సబ్జెక్టులో డీఎస్సీ రాసిన చంద్రశేఖర్‌ 77.03 మార్కులు సాధించాడు. రెండు నెలల క్రితమే గురుకుల పాఠశాలలో టీజీటీగా ఉద్యోగం సాధించారు. చంద్రశేఖర్‌ తల్లి కమల తండ్రి నారాయణ చేనేత కార్మికులు. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్‌ సాధించిన చంద్రశేఖర్‌ను గ్రామస్థులు, నాయకులు అభినందించారు. డీఎస్సీ ఫలితాల్లో తనకు మంచి మార్కులు రావడం సంతోషంగా ఉందని చంద్రశేఖర్‌ చెప్పారు. పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో కోచింగ్‌ తీసుకుంటూ రోజుకు 18 గంటలు చదివినానని.. తాను పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని పేర్కొన్నారు.


టీచర్‌ పోస్టుల వివరాలు..

పోస్టు పేరు సంఖ్య

స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629

భాషా పండితులు 727

పీఈటీలు 182

సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ 6,508

స్కూల్‌ అసిస్టెంట్‌

(స్పెషల్‌ ఎడ్యుకేటర్స్‌) 220

సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌

(స్పెషల్‌ ఎడ్యుకేటర్స్‌) 796

మొత్తం 11,062

Updated Date - Oct 01 , 2024 | 03:08 AM