ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Revanth Reddy: కవిత కోసం బీఆర్ఎస్‌ను మోదీకి తాకట్టు పెట్టిన కేసీఆర్.. రేవంత్ విసుర్లు

ABN, Publish Date - Apr 15 , 2024 | 09:36 PM

అన్నివర్గాలకు కాంగ్రెస్ (Congress) సామాజిక న్యాయం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. నారాయణపేటలో జరిగిన జన జాతర భారీ బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై రేవంత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సభలో పాలమూరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

నారాయణపేట: అన్నివర్గాలకు కాంగ్రెస్ (Congress) సామాజిక న్యాయం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. నారాయణపేటలో జరిగిన జన జాతర భారీ బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై రేవంత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సభలో పాలమూరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పార్టీని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు.


Harish Rao: అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హరీశ్‌రావు విసుర్లు

డీకే అరుణ కుట్ర చేశారు...

బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ బీఆర్ఎస్‌తో కుమ్మకై మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించాలని కుట్ర చేశారని మండిపడ్డారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ముందు కూడా తమ ఎంపీ అభ్యర్థులను ఓడించడానికి ఈ రెండు పార్టీల నేతలు కుమ్మక్కు అయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి ఈ ఎన్నికల్లో ఓటు వేయమని అడుగుతున్నారని చెప్పారు. కేసీఆర్ నరేంద్ర మోదీకి లొంగిపోయారని ఆరోపించారు.


కవిత బెయిల్ కోసం...

ఆయన బిడ్డ బెయిల్ కోసం ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో బీజేపీని గెలిపించేలా ప్లాన్ చేశారని విమర్శించారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ లోపల ఏకకాలంలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. తెలంగాణ రైతన్నలు ఎవరు అధైర్య పడొద్దన్నారు. ప్రతి ధాన్యం గింజను కొంటామని భరోసా కల్పించారు. వచ్చే పంటకు ధాన్యానికిి రూ. 500లు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు.


Jeevan Reddy: నిజామాబాద్‌లో పసుపుబోర్డుకు కాంగ్రెస్ సిద్ధం...

వారికి టికెట్లు ఇస్తాం..

పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇస్తామని మాటిచ్చారు. త్వరలో ఇందిరమ్మ కమిటీలు వేయబోతున్నామని చెప్పారు. మహబూబ్‌నగర్ ఎంపీగా వంశీ చంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆ మేరకు కేసీఆర్ సుపారీ తీసుకున్నారని ఆరోపించారు. కవితను జైలు నుంచి విడుదల చేయించేందుకు కేసీఆర్ ఇలా కుట్ర పన్నాడన్నారు. పక్కనే కృష్ణా నది ఉన్న మనకు చుక్క నీరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


TG Politics: ఏపీలో నేతలపై రాళ్ల దాడి.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

జిల్లా ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని చెప్పారు. ఈ ప్రాంత సమస్యలను బీజేపీ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్ర జనాభాలో 10 శాతం ఉన్న ముదిరాజులకు కేసీఆర్ ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదని అన్నారు. తమకు లోక్‌సభ ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్‌లో సామాన్యులకి టికెట్లు ఇచ్చామని తెలిపారు. మాదిగలకు కేసీఆర్ అన్యాయం చేశారని మండిపడ్డారు. ఆనాడు ఎస్సీ వర్గీకరణ కోసం తాను పోరాడానని చెప్పారు. డీకే అరుణ బంగ్లా రాజకీయాలు చేశారని.. కుమ్మక్కు రాజకీయాలు చేసి గద్వాలలో యాదవ సామాజిక వర్గానికి చెందిన సరితను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని ధ్వజమెత్తారు.


MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ కస్టడీ పొడిగింపు.

ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడాను...

అన్నివర్గాలకు కాంగ్రెస్ అండగా నిలుస్తోందన్నారు. పాలమూరు - రంగారెడ్డి జాతీయ హోదా కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం, ఈ ప్రాంత రైల్వే లైన్ కోసం డీకే అరుణ ఏనాడైనా కేంద్రంతో మాట్లాడరా అని ప్రశ్నించారు. ఆనాడు కాంగ్రెస్ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉంటే.. ఇప్పుడు మోదీ హయాంలో రూ.1200 అయిందని విరుచుకుపడ్డారు. ప్రతి పేదవాడికి కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేసి అండగా ఉంటామని భరోసా కల్పించారు. తాను ఈ గడ్డపై పుట్టానని.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానని మాటిచ్చారు.


18 గంటలు పని చేస్తున్నాం..

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని కేసీఆర్ మోసం చేశారన్నారు. మాట తప్పిన బీఆర్ఎస్‌ను మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బొంద పెట్టారని అన్నారు. పేదల కోసం 4 లక్షల 50 వేల ఇళ్లను తాము మంజూరు చేసినట్లు తెలిపారు. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని స్పష్టం చేశారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని తెలిపారు. తన మంత్రివర్గం రోజు 18 గంటలు పనిచేస్తూ తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


Chattisgarh: బీజాపూర్ ఎన్‌కౌంటర్లకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్ట్ పార్టీ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 15 , 2024 | 09:56 PM

Advertising
Advertising