ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: భారీ ఎత్తున చేరికలపై అనుమతి కోసం నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌..

ABN, Publish Date - Jun 24 , 2024 | 03:00 AM

సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంటులో కాంగ్రెస్‌ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న సీఎం.. 2 రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. మంగళవారం రాత్రికి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

  • రెండు రోజులపాటు అక్కడే మకాం

  • రాష్ట్రంలో రాజకీయ కార్యాచరణపై

  • అధిష్ఠానంతో చర్చించే అవకాశం

  • మంత్రివర్గ విస్తరణపైనా మంతనాలు

  • కేంద్ర మంత్రులతోనూ భేటీ

  • రాష్ట్రానికి నిధులు కోరనున్న సీఎం

హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంటులో కాంగ్రెస్‌ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న సీఎం.. 2 రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. మంగళవారం రాత్రికి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ఈ 2 రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి, ఆర్థికంగా కేంద్ర సహకారానికి సంబంధించి ఆయా శాఖల కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలవనున్నారు. రాష్ట్రానికి కేంద్ర సాయాన్ని కోరుతూ వారికి వినతిపత్రాలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా రుణమాఫీ వంటి పెద్ద కార్యక్రమాలు పెట్టుకున్నందున కేంద్రం నుంచి సహకారం కోరనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


అధికారికంగా కేంద్ర మంత్రులను కలుస్తూనే.. కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలనూ కలిసి రాష్ట్రంలో రాజకీయ కార్యాచరణపైనా రేవంత్‌ చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. బీఆర్‌ఎ్‌సకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కాంగ్రె్‌సలో చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ చేరికలపై అధిష్ఠానం పెద్దలతో సీఎం రేవంత్‌ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అధిష్ఠానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే.. బడ్జెట్‌ సమావేశాలలోపే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కాంగ్రె్‌సలో చేరతారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపైనా కాంగ్రెస్‌ హైకమాండ్‌తో సీఎం చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.


ప్రధానంగా ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలకు కేబినెట్‌లో ప్రాతినిధ్యంపైనే చర్చించనున్నట్లు చెబుతున్నారు. నిజామాబాద్‌లో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రేమ్‌సాగర్‌రావు లేదా ఎడ్మ బొజ్జుకు మంత్రివర్గంలో చోటు కల్పించే అంశంపై చర్చిస్తారని పేర్కొంటున్నారు. బీసీల్లో ముదిరాజ్‌ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని రేవంత్‌ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సామాజికవర్గం నుంచి ఒక నేతను ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రిని చేసే చాన్స్‌ కూడా ఉందని ఒక సందర్భంలో ఆయనే అన్నారు.


దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కుతుందా? లేక మరో నేతను వరిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధి పైనే సీఎం రేవంత్‌ ప్రధానంగా దృష్టి పెట్టారని, ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు, ప్రభుత్వ పెద్దలను కలిసేందుకే ప్రాధాన్యం ఇ్తారని చెబుతున్నారు.

Updated Date - Jun 24 , 2024 | 03:00 AM

Advertising
Advertising