ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: బీజేపీతో ఎవరు కుమ్మక్కయ్యారు?

ABN, Publish Date - Jun 28 , 2024 | 05:31 AM

‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి 32 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. పార్లమెంటు ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థికి 21వేల మెజారిటీనే వచ్చింది. మిగతా ఓట్లను రేవంత్‌ బీజేపీకి వేయించారా..?

  • మల్కాజ్‌గిరి, పాలమూరులో కమలం ఎలా గెలిచింది?

  • రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సిగ్గు చేటు: మంత్రి హరీశ్‌ రావు

హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి 32 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. పార్లమెంటు ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థికి 21వేల మెజారిటీనే వచ్చింది. మిగతా ఓట్లను రేవంత్‌ బీజేపీకి వేయించారా..? సీఎం సొంత నియోజకవర్గమైన మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఎలా విజయం సాధించింది..? రేవంత్‌రెడ్డి మొన్నటి వరకు ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన మల్కాజిగిరిలో బీజేపీ భారీ మెజారిటీతో ఎలా గెలిచింది..?’’ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిలదీశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కయ్యాయని రేవంత్‌ రెడ్డి ఆరోపించడం సిగ్గు చేటని మండిపడ్డారు. మెదక్‌లో బీజేపీని బీఆర్‌ఎస్‌ గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదని అన్నారు.విమర్శించారు.


గురువారం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు స్పందించారు. మెదక్‌ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో మూడు చోట్ల బీఆర్‌ఎస్‌ మెజారిటీ సాధించిందని, రఘునందన్‌ రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలో కూడా బీఆర్‌ఎస్‌ మెజారిటీ సాధించిందని పేర్కొన్నారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రె్‌సలో ఉండి బీజేపీ ఎజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. నిండు సభలో మోదీని పెద్దన్న అని సంబోధించారని.. పీఎం, సీఎం కుమ్మక్కై సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ శక్తి అయిన బీఆర్‌ఎ్‌సను టార్గెట్‌ చేశాయని

Updated Date - Jun 28 , 2024 | 05:31 AM

Advertising
Advertising