Share News

Congress-BRS: చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ ఘర్షణ

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:08 PM

జగిత్యాలలో చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ - బీఆర్ఎస్‌ల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు ప్రోటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. దీనిని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు

Congress-BRS: చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ ఘర్షణ

జగిత్యాల: జగిత్యాలలో చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ (Congress) - బీఆర్ఎస్‌ (BRS)ల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ (MLA Sanjay Kumar)కు ప్రోటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. దీనిని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy), సంజయ్ కుమార్ ముందే ఇరు పార్టీల కార్యకర్తలు తోసుకున్నారు. జై బీఆర్ఎస్, జై కాంగ్రెస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను జీవన్ రెడ్డి వారించారు. విప్, ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ (Atluri Lakshman) ఇది మంచి పద్ధతి కాదంటూ కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Hyderabad: మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డిల అక్రమాలను బయటపెడతాం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 09 , 2024 | 01:08 PM