ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: ప్రొటోకాల్‌ ఉల్లంఘనను అడ్డుకోండి..

ABN, Publish Date - Jul 16 , 2024 | 03:04 AM

రాష్ట్రం లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసే విధంగా కొత్త సంస్కృతిని తీసుకొచ్చిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు.

  • స్పీకర్‌కు కేటీఆర్‌ బహిరంగ లేఖ

  • ఫిర్యాదులు పట్టించుకోరా: హరీశ్‌

హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసే విధంగా కొత్త సంస్కృతిని తీసుకొచ్చిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, దీన్ని తక్షణం అడ్డుకోవాలని స్పీకర్‌ గడ్డ ప్రసాద్‌కుమార్‌ను కోరుతూ సోమవారం కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అందించాల్సిన చెక్కులను స్థానిక ఎమ్మెల్యేను కాదని కాంగ్రెస్‌ నాయకులే పంపిణీ చేస్తున్నారని పేర్కొ న్నారు. 7 నెలలుగా జరుగుతున్న ప్రొటోకాల్‌ ఉల్లంఘనలను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసినా, మీరు అందుబాటులోకి రాలేదని స్పీకర్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.


బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ప్రొటోకాల్‌ను పరిరక్షించాలని సీఎస్‌ సహా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని విస్మరించి.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి అధికారులు సలాం కొట్టడమేంటని మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల పట్ల ప్రొటోకాల్‌ పాటించడంలేదని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కాగా, నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుండగా అరెస్టు చేసిన విద్యార్థి నాయకులందరినీ బేషరతు గా విడుదల చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఉచితం అంటూనే బస్సు చార్జీల పెంపుపై కర్ణాటక దృష్టి పెట్టిందని, తెలం గాణలోనూ చార్జీలు పెంచే రోజు ఎంతో దూరంలో లేదని అభిప్రాయపడ్డారు.

Updated Date - Jul 16 , 2024 | 03:04 AM

Advertising
Advertising
<