ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhuvanagiri: యాదగిరికొండపై భక్తుల సందడి..

ABN, Publish Date - Jun 24 , 2024 | 04:52 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం వారాంతపు సెలవు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 40 వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి వచ్చారు.

  • స్వామివారిని దర్శించుకున్న 40 వేలమంది భక్తులు

భువనగిరి అర్బన్‌, జూన్‌ 23: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం వారాంతపు సెలవు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 40 వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి వచ్చారు. వీఐపీ టికెట్‌ దర్శనానికి గంట, ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఉభయ క్యూలైన్లు ఉదయం నుంచి రాత్రి వరకు కిటకిటలాడాయి. కొండపైన బస్టాండ్‌లో ఆలయ అధికారులు వాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేయడంతో బస్సు ఎక్కాలంటే తీవ్ర ఆటం కం కలిగింది.


ఆలయ ఖజానాకు రూ.64,43,032 ఆదాయం సమకూరినట్లు ఈవో భాస్కర్‌రావు తెలిపారు. లక్ష్మీనరసింహస్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జె. శ్రీనివా్‌సరావు ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామిఅమ్మవార్ల పూజల్లో పాల్గొన్నారు

Updated Date - Jun 24 , 2024 | 04:52 AM

Advertising
Advertising