Danam Nagender: మాజీమంత్రి, ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN, Publish Date - Jun 07 , 2024 | 10:51 AM
బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని, అందుకే కాంగ్రెస్ ఓటమి పాలైందని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Dana Nagender) ఆరోపించారు.
- బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం..
- అందుకే కాంగ్రెస్ ఓటమి : దానం
హైదరాబాద్: బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని, అందుకే కాంగ్రెస్ ఓటమి పాలైందని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Dana Nagender) ఆరోపించారు. బంజారాహిల్స్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విజయం కోసం డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జీలు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారన్నారు. కాంగ్రెస్ పార్టీపైన అభిమానం, తన పట్ల ప్రేమ, ముఖ్యమంత్రి రేవంత్(Chief Minister Revanth) నాయకత్వంపైన విశ్వాసం కారణంగా పెద్ద ఎత్తున ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారన్నారు. తన ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు.
ఇదికూడా చదవండి: Hyderabad: ఆ నాలుగు డివిజన్లకు ఉప ఎన్నికలు ఎప్పుడో..?
బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని తెలిసే తాను బీఆర్‌ఎస్‌ను వీడినట్లు చెప్పారు. తన ఆరోపణలు వాస్తవం చేస్తూ బీఆర్‌ఎస్ ప్రజాప్రతినినిధులు బీజేపీ కోసం పనిచేశారని ఆరోపించారు. బీజేపీ అక్రమ మార్గాల్లో మద్యం, డబ్బు పంపిణీ చేస్తూ విజయం సాధించిందన్నారు. సికింద్రాబాద్‌లో నైతిక విజయం తనదేనన్నారు. పరిస్థితులు మారుతున్నాయి.. బీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గుతుంది.. అభివృద్ధి ఆకాంక్షించే ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లోకి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని తెలిపారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 07 , 2024 | 10:51 AM