ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Warangal: మేడారం గద్దెల వద్ద పూజారుల ధర్నా ..

ABN, Publish Date - May 30 , 2024 | 05:22 AM

వనదేవతల గద్దెల వద్ద పూజారులు ధర్నా చేశారు. వరంగల్‌లోని ధార్మిక భవనానికి సమ్మక్క సారలమ్మల పేరు పెట్టాలని, రెండేళ్లకోసారి జరిగే మహాజాతర ఆదాయం నుంచి మూడో వంతు వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం మేడారం దేవస్థానం ప్రధాన గేటు ఎదుట అర్చక సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ప్రధాన పూజారి కొక్కెర రమేశ్‌ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నాకు దిగారు.

  • వరంగల్‌ ధార్మిక భవనానికి సమ్మక్క-సారలమ్మ పేరు పెట్టాలని డిమాండ్‌

  • జాతర ఆదాయంలో మూడోవంతు వాటా ఇవ్వాలని పట్టు

  • మంత్రి సీతక్క హామీతో ధర్నా విరమణ

మేడారం, మే 29: వనదేవతల గద్దెల వద్ద పూజారులు ధర్నా చేశారు. వరంగల్‌లోని ధార్మిక భవనానికి సమ్మక్క సారలమ్మల పేరు పెట్టాలని, రెండేళ్లకోసారి జరిగే మహాజాతర ఆదాయం నుంచి మూడో వంతు వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం మేడారం దేవస్థానం ప్రధాన గేటు ఎదుట అర్చక సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ప్రధాన పూజారి కొక్కెర రమేశ్‌ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ప్రధాన పూజారి కొక్కేర రమేశ్‌ మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మల దేవస్థానం ధార్మిక భవనం కోసం 1993లో అప్పటి ప్రభుత్వం వరంగల్‌ నగరంలోని సెంట్రల్‌ జైల్‌ ఎదుట 1014 గజాల స్థలం కేటాయించిందని, 2022లో ధార్మిక భవనాన్ని నిర్మించారని, కానీ భద్రకాళి దేవస్థానం అర్చకులు, అధికారులు దాన్ని వేద పాఠశాల పేరుతో ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.


ధార్మిక భవనం నిర్మాణ ప్రారంభం నుంచి భవనానికి సమ్మక్క-సారలమ్మ పేరు పెట్టాలని అధికారులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతులు సమర్పించినా పట్టించుకోలేదని తెలిపారు. మేడారం దేవస్థానం జాతరకు వచ్చే ఆదాయంలో తమకు మూడో వంతు వాటాను కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బంగారం, వెండిలో తమకు వాటా అందడం లేదన్నారు. పూజారుల ధర్నా గురించి తెలుసుకున్న మంత్రి సీతక్క.. సమస్యను సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మేడారం దేవస్థానం ఆధారాలను చూపించి ప్రత్యేక జీవో తీసుకువస్తామని, ధార్మిక భవనానికి కూడా మేడారం అమ్మవార్ల పేరును ప్రకటించి మేడారం దేవస్థానం ఈవో ఆధ్వర్యంలోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. దాంతో పూజారులు ధర్నాను విరమించుకున్నారు.

Updated Date - May 30 , 2024 | 05:22 AM

Advertising
Advertising