Share News

Sridhar Babu: సేమీ కండక్టర్ల రంగంలో ఉపాధి అవకాశాలు..

ABN , Publish Date - Sep 21 , 2024 | 04:52 AM

సెమీ కండక్టర్ల రంగం భారీగా విస్తరించనున్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు.

Sridhar Babu: సేమీ కండక్టర్ల రంగంలో ఉపాధి అవకాశాలు..

  • నైపుణ్యతతో అందిపుచ్చుకోవాలి: శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): సెమీ కండక్టర్ల రంగం భారీగా విస్తరించనున్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్యాలు సాధించి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యువత సిద్ధంగా ఉండాలన్నారు. హైటెక్‌ సిటీలోని సెమీ కండక్టర్ల సంస్థ వాలుకా విస్తరణ యూనిట్‌ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. సంస్థ పదేళ్లుగా సెమీ కండక్టర్‌ రంగంలో సాధించిన విజయాలను మంత్రి ప్రశంసించారు.


ప్రస్తుతం 50మంది సిబ్బంది ఉన్న వాలుకా వచ్చే ఏడాది కాలంలో 300 మందిని, రెండేళ్లలో మొత్తం 500 మందిని నియమించుకుంటుందన్నారు. కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, 5జీ వంటి అధునాతన పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి తమ నూతన విస్తరణ దోహదపడుతుందని వాలుకా అధినేత సునీల్‌ కుమార్‌ జాస్తి తెలిపారు.

Updated Date - Sep 21 , 2024 | 04:52 AM