ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ED: కేటీఆర్‌పై ఈడీ కేసు

ABN, Publish Date - Dec 21 , 2024 | 03:41 AM

ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. కేటీఆర్‌, అర్వింద్‌కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డిపై ఈడీ అధికారులు కేసు పెట్టారు.

  • ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈసీఐఆర్‌.. కేటీఆరే ఏ1

  • ఒకట్రెండు రోజుల్లో నోటీసు కోర్టులో క్వాష్‌ పిటిషన్‌!

  • నేడో రేపో ఏసీబీ విచారణ!

  • కేటీఆర్‌కు నోటీసులు?

హైదరాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. కేటీఆర్‌, అర్వింద్‌కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డిపై ఈడీ అధికారులు కేసు పెట్టారు. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ), విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద కేటీఆర్‌ తదితరులపై ఈడీ అధికారులు ‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్టు (ఈసీఐఆర్‌)’ నమోదు చేశారు. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా కేసు పత్రాలను, పురపాలక శాఖ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు ప్రతులను తమకు పంపించాలని ఏసీబీకి ఈడీ అధికారులు శుక్రవారం లేఖ రాశారు. ఏసీబీ కేసు ఫైల్‌ సాయంత్రానికి ఈడీ కార్యాలయానికి చేరింది. దీంతో ఈసీఐఆర్‌ నమోదు చేశారు. ఇందులోనూ కేటీఆర్‌ను ఏ1గా పేర్కొన్నారు. అర్వింద్‌కుమార్‌ను ఏ2గా, బీఎల్‌ఎన్‌ రెడ్డిని ఏ3గా చూపారు. ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించి బ్రిటన్‌కు చెందిన ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌ (ఎఫ్‌ఈవో)కు సుమారు రూ.46 కోట్లను డాలర్ల రూపంలో పంపడంపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించనుంది.


ఎఫ్‌ఈవోతో ఒప్పందం జరగడానికి ముందే నిధులను డాలర్ల రూపంలో పంపడం, ఒప్పందంతో ఎలాంటి సంబంధం లేని హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి ఈ డబ్బును పంపడం నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టం చేసింది. వాస్తవానికి డాలర్ల రూపంలో విదేశీ కంపెనీకి డబ్బు పంపించాలంటే భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) నుంచి అనుమతి తీసుకోవాలి. మరోవైపు విదేశీ కంపెనీతో రాష్ట్రం ఏదైనా ఒప్పందం చేసుకుంటే దానికి క్యాబినెట్‌ అనుమతి ఉండాలి. గవర్నర్‌ అనుమతి కూడా ఉండాలి. కానీ, ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో నాటి మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించి రూ.46 కోట్లను డాలర్ల రూపంలో పంపడం వల్ల హెచ్‌ఎండీఏ దాదాపు రూ.8 కోట్లు ఆదాయ పన్ను చెల్లించాల్సి వచ్చిందని ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కాగా, విచారణకు హజరు కావాలంటూ కేటీఆర్‌, అర్వింద్‌కుమార్‌, బీఎల్‌ఎన్‌రెడ్డికి ఈడీ అధికారులు ఒకటి రెండు రోజుల్లో నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది.


ఈడీ కేసుపైనా హైకోర్టుకు..?

ఏసీబీ కేసు విషయంలో కేటీఆర్‌కు హైకోర్టులో కొంత ఊరట లభించగా.. ఆపై గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసుపైనా కేటీఆర్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. పీఎంఎల్‌ఏ, ఫెమా చట్టం ప్రకారం ఈడీ కేసు నమోదు చేయడంతో క్వాష్‌ పిటిషన్‌పై సుదీర్ఘవాదనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్వాష్‌ పిటిషన్‌ వేయకుండా, ఈడీ విచారణకు హజరు కావాలా? వద్దా? అనే విషయంపైనా బీఆర్‌ఎస్‌ నేతలు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Dec 21 , 2024 | 03:41 AM