ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కాంగ్రెస్‌లోకి మాజీ స్పీకర్‌ పోచారం..

ABN, Publish Date - Jun 22 , 2024 | 03:57 AM

లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన బీఆర్‌ఎ్‌సకు.. శుక్రవారం ఊహించని షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివా్‌సరెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె స్‌లో చేరారు.

  • ఇంటికి వెళ్లి కండువా కప్పిన సీఎం రేవంత్‌

  • ఆయనకు సముచిత గౌరవం ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడి

  • రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్‌లో చేరా: పోచారం శ్రీనివాస్‌రెడ్డి

  • అసెంబ్లీలో 70కి పెరిగిన కాంగ్రెస్‌ బలం.. అదేబాటలో మరికొందరు?

  • బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. 34కు తగ్గిన ఆ పార్టీ బలం

  • పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ శ్రేణుల యత్నం

  • బాల్క సుమన్‌ సహా 12 మందిపై కేసులు.. అరెస్టు

హైదరాబాద్‌, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన బీఆర్‌ఎ్‌సకు.. శుక్రవారం ఊహించని షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివా్‌సరెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె స్‌లో చేరారు. పోచారంతోపాటు ఆయన కుమారుడు భాస్కర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి 15 మందికి పైగా ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రె్‌సలో చేరుతారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నా... పోచారం శ్రీనివా్‌సరెడ్డి చేరనున్నారన్న అనుమానం బీఆర్‌ఎస్‌ నాయకత్వానికి సైతం రాలేదు. బీఆర్‌ఎస్‌ హయాంలో వ్యవసాయశాఖ మంత్రిగా, స్పీకర్‌గా వ్యవహరించిన ఆయన... అనూహ్యంగా సీఎం రేవంత్‌రెడ్డిని తన నివాసానికి ఆహ్వానించి, ఆయన సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. శుక్రవారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీ బలరాం నాయక్‌ తదితరులు పోచారం నివాసానికి వెళ్లి పార్టీలోకి లాంచనంగా ఆహ్వానించారు. అక్కడికక్కడే పోచారం శ్రీనివా్‌సరెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్‌రెడ్డికి రేవంత్‌ పార్టీ కండువాలు కప్పారు.


నాడు శాసనసభాపక్షాన్ని విలీనం చేసి...

2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది టీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనమైన సంగతి తెలిసిందే. ఆ 12 మంది ఎమ్మెల్యేలు శాసనసభాపక్షంగా ఏర్పడి టీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం అయ్యారు. ఆ సమయంలో స్పీకర్‌గా ఉన్న పోచారం శ్రీనివా్‌సరెడ్డి ఈ విలీనానికి ఆమోద ముద్ర వేశారు. 2023 ఎన్నికల్లో 64 సీట్లు సాధించి.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగా.. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రె్‌సలో చేరగా.. తాజాగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివా్‌సరెడ్డి ఆ జాబితాలో చేరారు. ఆనాడు స్పీకర్‌ హోదాలో టీఆర్‌ఎ్‌సఎల్పీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల విలీనానికి ఆమోద ముద్ర వేసిన పోచారం.. తాజా పరిస్థితుల దృష్ట్యా ఆయనే కాంగ్రెస్‌ గూటికి చేరడం విశేషం. 2023 ఎన్నికల్లో కాంగ్రె్‌సకు 64 సీట్లు రాగా.. మిత్రపక్షం సీపీఐకి వచ్చిన ఒక సీటుతో కలిపి ఆ పార్టీ బలం 65గా ఉంది.


కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో గెలవడంతో ఆ సంఖ్య 66కు చేరింది. తాజాగా చేరిన పోచారం సహా ఇప్పటికే చేరిన ముగ్గురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కలిపితే అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 70కి చేరినట్లయింది. కంటోన్మెంట్‌ సిటింగ్‌ సీటును కోల్పోవడంతో సాంకేతికంగా బీఆర్‌ఎస్‌ బలం 38 సీట్లకు పడిపోయింది. ఇందులో నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ గూటికి చేరడంతో సభలో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 34కు తగ్గిపోయింది. ఈ మేరకు 2018 నాటి ఫార్ములానే అమలు చేసి.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను సీఎల్పీలో అధికారికంగా చేర్చుకునే ఆలోచనలో కాంగ్రెస్‌ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 38 కాగా.. విలీన ప్రక్రియ జరగాలంటే 26 మంది కాంగ్రె్‌సకు మద్దతు తెలపాల్సి ఉంటుంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సకు మద్దతు తెలపగా.. మరో 22 మందిని ఆకర్షించి, శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


పోచారానికి సముచిత గౌరవం

భవిష్యత్తులో పోచారం శ్రీనివా్‌సరెడ్డికి సముచిత గౌరవం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఆయనను కలిశామని, పెద్ద వారిగా అండగా నిలబడాలని కోరామన్నారు. రైతుల సంక్షేమం కోసమే పోచారం.. కాంగ్రె్‌సలో చేరారని, ఈ దిశగా ఆయన సలహాలు, సూచనలు తీసుకుని ముందుకెళ్తామన్నారు. పోచారం శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రేవంత్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నారు. రైతాంగానికి రేవంత్‌ చేస్తున్న మంచి కార్యక్రమాలకు అండగా ఉండాలనే కాంగ్రె్‌సలోకి వచ్చానన్నారు. కొత్త ప్రభుత్వంలో సమస్యలు సహజమని, రేవంత్‌రెడ్డి వాటిని ధైర్యంగా అధిగమిస్తున్నారని కొనియాడారు. రేవంత్‌కు మరో 20ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉందన్నారు. ఆయన నాయకత్వంలో పని చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.


పోచారం నివాసం వద్ద హైడ్రామా

బంజారాహిల్స్‌: పోచారం శ్రీనివా్‌సరెడ్డి నివాసం వద్ద శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12లోని పోచారం నివాసానికి సీఎం రేవంత్‌రెడ్డి వచ్చారన్న సమాచారంతో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మరికొంత మంది బీఆర్‌ఎస్‌ నేతలు అక్కడకు చేరుకున్నారు. చర్చలు ముగించుకొని రేవంత్‌రెడ్డి బయటకు వస్తుండగా.. ఇంట్లోకి వెళ్లేందుకు బాల్క సుమన్‌ ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు బాల్క సుమన్‌ను అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. బాల్కసుమన్‌తో పాటు మన్నె గోవర్ధన్‌రెడ్డి, కె.వాసుదేవరెడ్డి, గెల్లు శ్రీనివా్‌సయాదవ్‌, అంజనేయగౌడ్‌, కదారి స్వామి యాదవ్‌, తుంగ బాలు, డి.రాజు, కె.జంగయ్య, వరికుప్పల వాసు, సి.దశరథ్‌, బాలరాజ్‌యాదవ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వీరికి నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Updated Date - Jun 22 , 2024 | 03:57 AM

Advertising
Advertising