Share News

Farmers: అధికార వికేంద్రీకరణతోనే సామాన్యులకు న్యాయం

ABN , Publish Date - Sep 28 , 2024 | 04:52 AM

రణి అమల్లోకి వచ్చాక కలెక్టర్లు, సీసీఎల్‌ఏ వద్ద మాత్రమే అధికారాలు కేంద్రీకృతం అయ్యాయని, వాటిని వికేంద్రీకరించినప్పుడే సామాన్యులకు

Farmers: అధికార వికేంద్రీకరణతోనే సామాన్యులకు న్యాయం

  • సీఎంకు మెదక్‌ జిల్లా రైతుల లేఖ

హైదరాబాద్‌, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ధరణి అమల్లోకి వచ్చాక కలెక్టర్లు, సీసీఎల్‌ఏ వద్ద మాత్రమే అధికారాలు కేంద్రీకృతం అయ్యాయని, వాటిని వికేంద్రీకరించినప్పుడే సామాన్యులకు న్యాయం జరుగుతుందని మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌ మండలానికి చెందిన రైతులు అభిప్రాయపడ్డారు. కొత్త ఆర్వోఆర్‌ చట్టంలో 1971 నాటి తెలంగాణ భూ హక్కులు, పట్టాదార్‌ పాస్‌పుస్తకం నిబంధనల ప్రకారం తహసీల్దార్లకు భూ పరిపాలనా అధికారాలు కల్పించాలని కోరారు.


ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. సామాన్య రైతులకు మేలు చేసే నిబంధనలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. పహానీ, 1బీ నకలు తీసుకోవాలంటే ప్రస్తుతం భారీగా ఫీజులు చెల్లించాల్సి వస్తోందని, దాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు పంపాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు కోరారు.

Updated Date - Sep 28 , 2024 | 04:52 AM