FGG: 17 మంది ఎంపీల్లో 14 మందిపై కేసులు ..
ABN, Publish Date - Jun 09 , 2024 | 04:42 AM
రాష్ట్రం నుంచి కొత్తగా ఎన్నికైన 17 మంది ఎంపీల్లో 14 మంది(82ు)పై కేసులున్నాయని ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎ్‌ఫజీజీ)’ తెలిపింది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై అత్యధికంగా 54 కేసులున్నాయని వెల్లడించింది.
బీజేపీ ఎంపీ ఈటలపై అత్యధికంగా 54 కేసులు
హైదరాబాద్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి కొత్తగా ఎన్నికైన 17 మంది ఎంపీల్లో 14 మంది(82ు)పై కేసులున్నాయని ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎ్‌ఫజీజీ)’ తెలిపింది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై అత్యధికంగా 54 కేసులున్నాయని వెల్లడించింది. ఎంపీ అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లను, ఎన్నికల ఫలితాలను ఎఫ్‌జీజీ విశ్లేషించి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఖమ్మం ఎంపీ రఘురామ్‌రెడ్డికి అత్యధికంగా 7,66,929 ఓట్లు పోలయ్యాయని తెలిపింది. మల్కాజిగిరి నియోజకవర్గంలో నోటాకు 13,366 మంది ఓటేశారని పేర్కొంది. ఎంపీల్లో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అత్యంత సంపన్నుడు కాగా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు అతి తక్కువ ఆస్తులున్నట్లు విశ్లేషించింది.
Updated Date - Jun 09 , 2024 | 04:42 AM