Hyderabad: గ్రూపు-4 సర్టిఫికెట్ వెరిఫికేషన్ నేటి నుంచి!
ABN, Publish Date - Jun 20 , 2024 | 03:32 AM
గ్రూపు-4 పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 20 నుంచి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీపీఎ్‌ససీ) అధికారులు పూర్తి చేశారు.
ఆగస్టు 21 వరకు కొనసాగనున్న ప్రక్రియ
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): గ్రూపు-4 పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 20 నుంచి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీపీఎ్‌ససీ) అధికారులు పూర్తి చేశారు. ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఆగస్టు 21 వరకు కొనసాగనుంది. రాష్ట్రంలో 8,180 గ్రూపు-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పరీక్షలను నిర్వహించి, వాటి ఫలితాలను కూడా ప్రకటించారు. ఎంపిక చేసిన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను కూడా నమోదు చేసుకున్నారు.
ఈ పోస్టుల భర్తీలో భాగంగా గురువారం నాటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ప్రారంభించనున్నారు. నాంపల్లిలోని టీపీఎ్‌ససీ కార్యాలయంతో పాటు పబ్లిక్ గార్డెన్స్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోనూ ఈ సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. నిర్దేశిత తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో చేపట్టే ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపికైనఅభ్యర్థుల హాల్‌టికెట్ల నంబర్ల వారీగా జాబితాలను విడుదల చేశారు. ఎవరైనా అనివార్య కారణాల వల్ల ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు గైరాపజరైతే.. వారి సర్టిఫికెట్లను ఆగస్టు 24, 27, 28, 29, 31 తేదీల్లో పరిశీలిస్తారు. ఆగస్టు 31న సాయంత్రం 5గంటల తర్వాత వెరిఫికేషన్‌కు అనుమతించబోమని అఽధికారులు ప్రకటించారు.
Updated Date - Jun 20 , 2024 | 03:32 AM