ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Harishrao: అబద్ధాలు ఆడడంలో రేవంత్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి

ABN, Publish Date - Apr 21 , 2024 | 09:42 PM

అబద్ధాలు ఆడడంలో సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy)కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harishrao) ఆరోపించారు.

మెదక్: అబద్ధాలు ఆడడంలో సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy)కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harishrao) ఆరోపించారు. ఆదివారం నాడు మెదక్‌ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ చెప్పవన్నీ అబద్ధాలేనని. మెదక్ రాందాస్ చౌరస్తా మీదుగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్‌కు రేవంత్ వెళ్లారని.. అక్కడ అభివృద్ధి కనిపించలేదా? అని ప్రశ్నించారు. ఆయన నామినేషన్‌కు వెళ్లిన కలెక్టరేట్ కట్టింది కేసీఆర్ కాదని.. నిన్ను మెదక్‌కు రప్పించిన ఘనత కేసీఆర్‌దన్నారు.


Secunderabad: బీజేపీకి దూరంగా జనసేన!

మెదక్‌కు రైలు తెచ్చింది కేసీఆర్ అని చెప్పారు. రూ.100 కోట్లు ఖర్చు చేసి లైన్ తెచ్చారన్నారు. మూడు జిల్లాలు చేసి, మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని అన్నారు. ఏడుపాయల అమ్మవారికి కేసీఆర్ రూ.100 కోట్లు ఇస్తే వాపసు తీసుకున్నావని.. రేవంత్‌కు అమ్మవారి ఉసురు తగులుతుందని హెచ్చరించారు. ఉరికిచ్చి కొడ్తా, పేగులు మెడలే వేసుకుంటా, బొందపెడ్తా, మానవ బాంబునవుతా అంటున్నావు. ఇవేనా సీఎం మాట్లాడాల్సిన మాటలా? అని ప్రశ్నించారు.


హామీల గురించి అడిగితే కేసులు ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తానని 100రోజులు దాటినా చేయనందుకు చెంపలేసుకుని 60 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాట తప్పడం, అబద్ధాలు ఆడడం రేవంత్ నైజమన్నారు. తమ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని లోకల్ కాదంటున్నావు, ఆయన ఇక్కడే స్థిరపడిన ఓటర్ అని చెప్పారు. కొడంగల్‌లో ఓడిపోయి మల్కాజిగిరికి పోయింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. తన ఎత్తుతో రేవంత్‌కు ఏం పని? రైతుల గురించి ఆలోంచి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


అహంకారంతో గాల్లో తేలుతున్న కాంగ్రెస్ భూమ్మీదికి రావాలంటే వెంకట్రామిరెడ్డిని పార్లమెంటుకు పంపించాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు 18 రోజులుగా వేచిచూస్తున్నా ప్రభుత్వం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొన్నామని గుర్తుచేశారు.కష్టాల పాలైన రైతులను పరామర్శించడానికి ఒక్క నిమిషం టైమ్ దొరకడం లేదా? అని ప్రశ్నించారు. మీ పార్టీ నేతలు వీ. హనుమంతురావు, మోత్కుపల్లి నర్సింహులను ఎందుకు కలవడం లేదని నిలదీశారు. ఇదేనా ప్రజా పాలన? తమ ఎమ్మెల్యేలను లాక్కునే బదులు ప్రజల కష్టాలు తీర్చాలని కోరారు. కేసీఆర్‌ను తిడుతూ కాలక్షేపం చేయడం కాదని.. హామీలను నెరవేర్చాలని కోరారు. హామీలు కోసం బాండు రాసిచ్చి బాండ్ల విలువ కూడా రేవంత్ తీశారని హరీశ్‌రావు మండిపడ్డారు.


MLA Vivekananda: రేవంత్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 21 , 2024 | 10:05 PM

Advertising
Advertising