ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: ఎమ్మెల్యే మర్రి విద్యా సంస్థల భూమి పత్రాలను పరిశీలించండి..

ABN, Publish Date - Aug 29 , 2024 | 03:46 AM

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన విద్యా సంస్థల భూమి పత్రాలను పరిశీలించాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది.

  • 7రోజుల్లో కూలుస్తామన్న నోటీసులపై ఎడ్యుకేషనల్‌

  • సొసైటీల పిటిషన్ల మీద హైకోర్టు ఆదేశం

  • వారి వాదనలు వినండి..

  • చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి

  • రెవెన్యూ అధికారులతో హైకోర్టు

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన విద్యా సంస్థల భూమి పత్రాలను పరిశీలించాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. పత్రాలు పరిశీలించడంతో పాటు వారి వాదనలు విన్న తర్వాతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని దుండిగల్‌ తహసీల్దార్‌, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దుండిగల్‌ మునిసిపాలిటీ పరిధిలో ఉన్న మర్రి ఎడ్యుకేషనల్‌ సొసైటీ, మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌, మారుతి ఎడ్యుకేషనల్‌ సొసైటీ, తదితర సంస్థల భవనాలు చిన్నదామెర చెరువు ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌(ఎ్‌ఫటీఎల్‌), బఫర్‌జోన్‌లో నిర్మించారని.. వాటిని తొలగించాలని ఆదేశిస్తూ తహసీల్దార్‌ నోటీసులు జారీచేశారు.


ఈ నోటీసులను సవాల్‌ చేయడంతో పాటు హైడ్రా, ఇతర శాఖల అధికారులు ఎలాంటి కూల్చివేతలు చేపట్టకుండా అడ్డుకోవాలని ఆయా సంస్థలు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశాయి. దుండిగల్‌లోని 483, 484, 485, 486, 487, 488 తదితర సర్వే నంబర్లలో 17.20 ఎకరాలు, 10 ఎకరాల్లో ఉన్న విద్యాసంస్థలను కూల్చివేయాలని, అవి ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నాయని నోటీసులు ఇచ్చారని పిటిషనర్లు తెలిపారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. చిన్నదామెర చెరువుకు సంబంధించిన 8.25 ఎకరాలను పిటిషనర్లు ఆక్రమించారంటూ తహసీల్దార్‌ ఏకపక్షంగా నిర్ధారణకు వచ్చారన్నారు.


తమ భవనాలను అక్రమ కట్టడాలుగా నిర్ధారించడం చెల్లదని, కేవలం ఏడు రోజులు సమయమిచ్చి వాటిని కూల్చేయాలని చెప్పడం అక్రమమని పేర్కొన్నారు. 2007లో గ్రామపంచాయతీ సర్పంచ్‌, కార్యదర్శి, ఈవో సంతకాలతో అనుమతులు పొంది నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు. విద్యార్థుల చదువులు, విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యా సంస్థలను కూల్చబోమని హైడ్రా ఇటీవల పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ రజనీకాంత్‌రెడ్డి వాదిస్తూ.. చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ చెరువుల పరిశీలనకు ఇటీవల అడ్వకేట్‌ కమిషనర్లను నియమించిందన్నారు.


ఆక్రమణలు ఉన్న చెరువుల్లో చిన్నదామెర కూడా ఉందని.. పిటిషనర్లు అక్రమాలకు పాల్పడినట్లు తేలిందని చెప్పారు. వాదనలు విన్న ఽధర్మాసనం.. ఏడు రోజుల్లో కూల్చాలన్న తహసీల్దార్‌ నోటీసును షోకాజ్‌ నోటీసుగా భావించాలని పేర్కొంది. వారంలో పత్రాలతో తహసీల్దార్‌ను సంప్రదించాలని సూచించింది. తహసీల్దారు వాటిని పరిశీలించి, వాదనలు విని చట్టప్రకారం వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఆలోగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ విచారణను ముగించింది. కాగా, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన గాయత్రి ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, అనురాగ్‌ వర్సిటీ, నీలిమ మెడికల్‌ కాలేజీ తదితర విద్యా సంస్థలపై 30 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పేర్కొంది.

Updated Date - Aug 29 , 2024 | 03:46 AM

Advertising
Advertising